బిజినెస్

సింగపూర్ టూర్‌కు మరింత మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: టైర్-2 సిటీల్లోని విమానాశ్రయాల్లో వౌలిక సదుపాయాలను పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా సింగపూర్‌కు వెళ్లే భారత టూరిస్టుల సంఖ్య పెరగవచ్చన్న అభిప్రాయం సింగపూర్ ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన లైఫ్‌స్టైల్ సర్వీసెస్ బ్రాండ్ అంచనాల మేరకు ఇకపై ఇరు దేశాల మధ్య విమాన ఫ్రీక్వెన్సీలు గణనీయంగా పెరుగుతాయి.
ఈ క్రమంలో టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని, ప్రత్యేకించి వారాంతపు సెలవుల్లో గ్రూపులుగా వచ్చే ప్రయాణికులు కూడా పెరుగుతారని ఆ అంచనాలు చెబుతున్నాయి. వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో సుమారు వంద విమానాశ్రయాలు నిర్మించేందుకు పెట్టుబడులు పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల భారత పర్యాటక రంగ మార్కెట్ విస్తరణకు, అభివృద్ధికి వీలుకలుతుందని సింగపూర్‌కు చెందిన వౌంట్ ఫేబర్ లీజర్ గ్రూప్ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ పాట్రిక్ లీ పీటీఐకి తెలిపారు. వివిధ విమానాశ్రయాలతో కనెక్టివిటీ పెరుగుతున్న క్రమంలో కొత్త విమాన యాన సంస్థలు కూడా సరికొత్త విమానాలను సింగపూర్-్భరత్ మధ్య నడిపే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. భారత్‌లోని టైర్-2 సిటీల్లోని కీలకమైన ట్రావెలింగ్ ఏజెన్సీలతో అనుసంధానమై టూరిజం వ్యాపార మార్కెట్‌ను మరింతగా విస్తరించాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. సింగపూర్ టూరిజం మార్కెట్‌కు భారత్ కీలకమైన వనరు అని, డీ మానిటరైజేషన్, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటివి కూడా సింగపూర్‌కు వచ్చే భారత యాత్రికుల సంఖ్యను తగ్గించలేదని, వాస్తవానికి ఇంకా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు భారత్ నుంచి సింగపూర్‌కు 12,72,074 మంది టూరిస్టులు వచ్చారని, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన ఈ సంఖ్య 15.94 శాంత పెరిగిందని ఆయన వివరించారు. ఆ దేశంలోప్రఖ్యాత కేబుల్ కార్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ఫేబర్ గ్రూప్ గణాంకాల మేరకు 2018లో 3,66,422 మంది భారతీయ విజిటర్లు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ టూరిజం బోర్డు డేటా ప్రకారం గడచిన యేడాది మొత్తం 1.32 మిలియన్ల భారతీయ విజిటర్లు సింగపూర్‌లో ల్యాండ్ అయ్యారు. ఇది గత యేడాది కన్నా 16 శాతం అధికమన్నారు. భారత పరిసరాల్లోని దుబాయ్, తాయ్‌ల్యాండ్, మలేషియా వంటి ఐదు ప్రధాన పర్యాటక గమ్యస్థానాల్లో సింగపూర్ కూడా ఒకటి.