బిజినెస్

అక్రమ లావాదేవీలపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: అక్రమ లావాదేవీలు నడుపుతున్న నాలుగు సంస్థలకు మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ మంగళవారం సుమారు రూ.64 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కంపెనీల అనుచిత లావాదేవీలు బీఎస్సీ స్టాక్ మార్కెట్ ఐశ్చికాల విషయంలో మదుపర్లను తప్పుదోవ పట్టించినట్టు సెబీ గుర్తించింది. నౌవేలీ అడ్వయిజరీ సర్వీసెస్ సంస్థకు రూ.21 లక్షలు, మామన్ కన్‌కాస్ట్ సంస్థకు రూ.15 లక్షలు, మనీ హార్ట్‌కేర్ సంస్థకు రూ.18 లక్షలు, జీసీకె స్టాక్ సంస్థకు రూ.10 లక్షల వంతున వంతున సెబీ విడివిడిగా జరిమానాలు విధించింది. ద్రవ్య స్టాక్ ఐశ్చిక విభాగంలో మోసపూరిత వ్యాపారం సాగిస్తున్న మొత్తం 14,720 సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్టు గత ఏప్రిల్‌లో సెబీ ప్రకటించిన దరిమిలా అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 50 సంస్థలపై జరిమానాలు, ఇతర శిక్షలను ప్రకటించడం జరిగింది. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు స్టాక్ ఆప్షన్ల సెగ్మెంట్‌లో పెద్దయెత్తున రివర్సల్ ట్రేడ్‌కు పాల్పడినట్టు సెబీ గుర్తించిన సంగతి తెలిసిందే.