బిజినెస్

స్వల్ప నష్టాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: విదేశీ మార్కెట్ల మిశ్రమ ఫలితాలతో పెద్దయెత్తున ఊగిసలాటకు గురైన స్వదేశీ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. పెద్దయెత్తున ఊగిసలాటకు గురైన సెనె్సక్స్ 350 పాయింట్లు ఎగబాకి మళ్లీ దిగువకు చేరింది. చివరికి 64.90 పాయింట్ల నష్టంతో 35,592 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సైతం 9 పాయింట్లు నష్టపోయి 10,652 వద్ద ముగిసింది. అమెరికన్ ఫెడరేషన్ మానిటరీ పాలసీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ తదితర అంశాలను క్షుణంగా పరిశీలిస్తున్న మదుపర్లు సోమవారం జాగరూకతతో వ్యవహరించారని ఆర్థిక రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా తొలుత మార్కెట్ వ్యతిరేక పరిస్థితుల్లోనే ఆరంభమై ఆందోళనకర స్థాయికి వెళ్లింది. అయితే డాలర్‌తో రూపాయి విలువ బలోపేతంతోబాటు మరికొన్ని అంశాలు కలిసి రావడంతో మళ్లీ కోలుకుంది. రాబోయే కేంద్ర మధ్యంతర బడ్జెడ్‌తోబాటు, ఎన్నికలు కూడా మార్కెట్ల అనిశ్చితికి కారణం అయ్యాయని ఆర్థిక రంగ నిపుణుడు వినోద్ నాయర్ తెలిపారు. సెనె్సక్స్‌లో యెస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా భారీగా నష్టాలను చవిచూశాయి. ఈ కంపెనీలు 2.43 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. కోటక్ బ్యాంకు, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, టాటాస్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీలు లాభాలు సంతరించుకున్నాయి. సన్‌పార్మా సుమారు సుమారు 2.61 శాతం లాభాలను ఆర్జించింది. అలాగే బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ సైతం లాభాలు పొందాయి. కాగా సెనె్సక్స్ ఒక దశలో 53,734.14 పాయింట్లకు ఎగబాకి మళ్లీ తిరోగమించి 35,375.51 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 9.35 పాయింట్లు నష్టపోయి 10,652.20 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి మారకం విలువ సోమవారం రూ.71.09 పలికింది. ఇక ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 1.05 శాతం పెరిగి బ్యారల్ 60.44 డాలర్లు పలికింది. ఇక విదేశీ పోర్టు పోలియో ఇనె్వస్టర్లు 223.44 కోట్ల విలువైన వాటాలు కొనుగొలు చేశారు. ఇక స్థానిక మదుపర్లు రూ.92.32 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.