బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన మూడు బోయింగ్ విమానాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ మంగళవారం విధిలేని పరిస్థితుల్లో మూడు బోయింగ్-737 విమానాలను రద్దు చేసింది. ఈక్రమంలో దేశంలో ప్రయాణించే దాదాపు 20 డొమెస్టిక్ విమానాల రాకపోకలూ రద్దయ్యాయి. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు తాజాగా రద్దయిన మూడు బోయింగ్ విమానాలతో కలిపి గత రెండు రోజుల వ్యవధిలో ఆగిపోయిన ఈ సంస్థకు చెందిన విమానాల సంఖ్య ఆరుకు చేరింది. లీజులు, అద్దెలు వంటివి చాలాకాలంగా చెల్లించని కారణంగా ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. ఇందుకు సంబంధించి ఆ విమానయాన సంస్థ స్పందన ఏమిటనేది వేచిచూడాల్సివుంది. చలా కాలంగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్న ఈ సంస్థ తన భాగస్వామి ఎతిహాడ్ సంస్థతో అదనపు నిధుల పెట్టుబడులపై చర్చలు సాగిస్తోంది. అయితే ఆ విదేశీ విమానయాన సంస్థ సైతం సుమారు 19 విమానాలను ఢిల్లీ, చెన్నై, ముంబయి, పూనే, హైదరాబాద్, పోర్టు బ్లెయిర్, బెంగళూరులకు రాకపోకలు నిలిపివేసింది.