బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. జనవరి నెల డెరివేటివ్స్ కాలపరిమితి ముగియనుండటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ వెలువడనుండటం, కేంద్రం శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం వల్ల మదుపరులు తాజా కొనుగోళ్లకు పూనుకోకుండా ఆచితూచి అడుగులు వేయడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం నామమాత్రపు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ నామమాత్రంగా 1.25 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.4 పాయింట్ల దిగువన ముగిశాయి. దిగ్గజ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్ల ధరలు అయిదు శాతం చొప్పున పుంజుకొని, సెనె్సక్స్ పడిపోకుండా కాపాడగలిగాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు మొదలు కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపరులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారు.
బీఎస్‌ఈ సెనె్సక్స్ బుధవారం తొలుత 359 పాయింట్లు దిగజారినప్పటికీ, తరువాత పుంజుకొని చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 1.25 పాయింట్ల దిగువన 35,591.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 0.40 పాయింట్లు దిగజారి 10,651.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే, లోహ, బ్యాంకింగ్ షేర్లలో అధికంగా ర్యాలీ వచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, స్థిరాస్తి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, బ్రాడర్ సూచీలు మంచి పనితీరును కనబరిచాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం పుంజుకోగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.22 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 354.36 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 81.27 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా-చైనా మధ్య ఆరు నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఇరు దేశాలు బలహీనపడటంతో పాటు ఫైనాన్సియల్ మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై నీలి నీడలు అలుముకున్నాయి. దీంతో ఈ వాణిజ్య వివాదాలకు తెరదింపే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు సాగే ఉన్నత స్థాయి చర్చలు మొదలు కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ మిశ్రమంగా కనిపించింది. జనవరి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగియనుండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపరులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారు.