బిజినెస్

ఎఫ్‌డీఐ నిబంధనల అమలుపై గడువు పొడిగించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెడులు (ఎఫ్‌డీఐ)లకు సంబంధించిన నిబంధనల్లో వెసులుబాట్లు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు విధించిన డెడ్‌లైన్ ఫిబ్రవరి 1ని మళ్లీ పొడిగించవద్దని కొన్ని ఆన్‌లైన్ వాణిజ్య (ఈకామర్స్) సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. స్నాప్‌డీల్, షాప్ క్లూస్ వంటి కొన్ని సంస్థలు ఈమేరకు ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ఇందుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయాల్సిందిగా వచ్చే వత్తిడులను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా ఆ సంస్ధలు కేంద్రానికి సూచించాయి. ఎఫ్‌డీఐ వౌలిక సూత్రాలను తాము అర్థం చేసుకునేందుకు మరికొంత గడువు కావాలని ఈకామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లు గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన క్రమంలో దాన్ని వ్యతిరేకిస్తూ స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ సంస్థలు ప్రభుత్వానికి సూచనలు చేయడం విఫణివీధిలోప్రాధాన చర్చనీయాంశమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విజ్ఞప్తి మేరకు కేంద్రం కొత్త నియంత్రణలతో కూడిన ‘ప్రెస్ నోట్-2’ను ప్రకటించడం జరిగింది. ఆ మేరకు ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిగే వస్తువులపై వాటాలు కలిగివుంటే ఆ కంపెనీల్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టవచ్చు. ఐతే ఇందుకు సంబంధించి ప్రత్యేక మార్కెట్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మార్పులు ప్రధానంగా ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాహల్ ఈనెల 25న కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ప్రభుకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రెస్‌నోట్-2ను సక్రమంగా, సరైన సమయానికి అమలు చేయడం ద్వారా ఈ కామర్స్‌లోని ఎఫ్‌డీఐ విధానానికి సంబంధించిన నిబంధనల అతిక్రమణకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం విధించిన కాలపరిమితి కూడా సరైనదేనని దీన్ని ఇక పొడిగించాల్సిన అవసరం లేదని కునాల్ స్పష్టం చేశారు. స్నాప్‌డీల్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను అప్‌డేట్ చేయడం జరిగిందని, స్టాటుటరీ ఆడిటర్లను సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. అమలులోకి రాబోయే నియమావళికి దృష్ట్యా పరిస్థితులు ఎలావుంటాయో అంచనా వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సరికొత్త నిబంధనలతో కూడిన ప్రతిపాదనలు భారతీయ రీటైల్ రంగాన్ని మరింతగా దెబ్బతీయకుండా చూస్తాయని ఆయన తెలిపారు. ఈ నిబంధనల అమలుకు మరింత కాలయాపన జరిగేలా చేసేందుకు తెచ్చే ఎలాంటి వత్తిడినైనా ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించాలని షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ సేథీ తన లేఖలో పేర్కొన్నారు. స్పష్టత పేరుతో జాప్యం చేయడం తగదన్నారు. నిబంధనలను అతిక్రమించేందుకే ఇలాంటి గడువులు కోరతారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎఫ్‌డీఐ నిబంధనలకు, వినియోగదారుని ప్రయోజనాలకు వ్యితిరేకంగా జరిగే పెద్ద ఈ కామర్స్ కంపెనీల ప్రయత్నాలకు సహకరించవద్దని వ్యాపారవేత్తల సంఘం ‘కెయిట్’ సైతం కేంద్ర వాణిజ్యమంత్రికి సూచించడం గమనార్హం. అమెరికా వత్తిడితో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా దేశంలో చిరు సంస్థలతో వ్యాపారాలు సాగించే 13 కోట్ల మందికి, వారి ఉద్యోగులకు ముప్పు కలుగుతుందని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని స్వదేశీ జాగరణ్ మంచ్ సైతం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.