బిజినెస్

ఫార్మాలిన్ లేదని ధ్రువీకరించాకే చేపల ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బీహార్, కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే చేపల్లో ఫార్మాలిన్ వాడటం లేదని అధికారులు ధ్రువీకరించాకే ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మత్స్యశాఖ అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతిదారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల ప్యాకింగ్‌లో ఫార్మాలిన్ వాడుతున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాణ్యతను పరిశీలించేందుకు సాంకేతిక బృందాలను పంపాల్సిందిగా అసోం, నాగాలాండ్, మణిపూర్ తదితర రాష్ట్రాలకు లేఖలు రాయగా, బీహార్ నుండి అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. ఆ బృందం క్షేత్ర పర్యటన చేయగా, ఫార్మాలిన్‌ను వినియోగించడం లేదని నిర్ధారించాకే, చేపల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు బీహార్ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్యాకేజింగ్‌లో కల్తీకి ఆస్కారం లేకుండా ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం తీసుకోవాలని స్పష్టం చేశారు. చేపల ప్యాకింగ్ పాయింట్ల వద్ద ఫార్మాలిన్, ఇతర రసాయనాలు వాడటం లేదని సర్టిఫై చేశాకే, ఇతర ప్రాంతాలకు సరఫరా జరిగేలా చూడాలని ఎగుమతిదారులను ఆదేశించారు. ప్యాకింగ్ పాయింట్ల వద్దే సర్టిఫై చేయడం వల్ల రైతులకు, ఉత్పత్తిదారులకు మేలు జరుగుతుందన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి మాట్లాడుతూ ఇటీవల పర్యటించిన బీహార్ బృందం 10 సూచనలు చేసిందని, వాటిని అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ పునేఠా