బిజినెస్

ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిండెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంకు నుంచి 28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు. ఇప్పటికే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 40 వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకోవడం జరిగిందని కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాల అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గార్గ్ తెలిపారు. కాగా తదుపరి మధ్యంతర డివిడెండ్‌పై వచ్చే బోర్డు సమావేశంలో రిజర్వు బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.