బిజినెస్

గుంటూరు యార్డుకు పోటెత్తిన మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 4: గుంటూరు మిర్చియార్డుకు మిర్చిబస్తాలు పోటెత్తాయి. రైతులు మిర్చిపంటను విక్రయించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. సోమవారం ఒక్కరోజులోనే 1,11,941 బస్తాల మిర్చి యార్డుకు చేరింది. ఒక్కసారిగా వచ్చి పడిన సరుకుతో యార్డు కిటకిటలాడింది. ఆసియా ఖండంతోనే అతిపెద్దదైన మిర్చియార్డుకు గుంటూరు జిల్లా నుండే కాకుండా ప్రకాశం, కర్నూలు, కృష్ణ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు ఇక్కడకు తీసుకు వస్తుంటారు. ఆదివారం సెలవుదినం కావడం, పంట సీజన్ ముమ్మర దశ లో ఉండడంతో సోమవారం పెద్ద ఎత్తున పంట యార్డుకు తరలివచ్చింది. ఒకేసారి వందలాది ట్రాక్టర్లు, లారీలు యార్డుకు చేరుకోవడంతో చిలకలూరిపేట, నర్సరావుపేట రహదారుల వైపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా యార్డుకు వచ్చిన సరుకులో 97,755 బస్తాల మేర విక్రయాలు జరిగాయి. నాన్ ఏసి కామన్ రకం క్వింటాల్ రూ.9,300 పలకగా, ప్రత్యేక రకానికి క్వింటాల్ రూ.9 వేల వరకు ధర లభించింది. అలాగే ఏసి కామన్ వెరైటీకి క్వింటాల్‌కు రూ.9,800 ధర లభించగా, ప్రత్యేక రకానికి రూ.7,700 ధర పలికింది. తాలుగాయలు క్వింటాల్ కనిష్ఠంగా రూ.2,500, గరిష్ఠంగా రూ.5,500 చొప్పున రైతులు విక్రయించుకున్నారు.

చిత్రం.. గుంటూరు మిర్చియార్డుకు పెద్ద ఎత్తున వచ్చిన మిర్చిబస్తాలు