బిజినెస్

మన జేబులకు చిల్లు.. వారికి కాసులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 4: ఈనెల ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ టారిఫ్ విధానం కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేలా, టెలివిజన్ చానల్స్ నిర్వాహకులకు కాసులు కురిపించేలా ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. కొత్త విధానం ప్రకారం కనీసం 25 శాతం అధికంగా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా తెలిపారు. అదే సమయంలో చానళ్ల నిర్వాహకుల ఆదాయం 40 శాతం వరకు పెరగవచ్చునని ఆయన చెప్పారు. అయితే వ్యూయర్‌షిప్ తక్కువగా ఉన్న చానళ్లకు మాత్రం ఇది పూర్తిగా ఇబ్బందేనని చెప్పవచ్చు. వారు తమ చానళ్లను పూర్తి ఉచితంగా మాత్రమే ప్రసారం చేయాల్సి ఉంది. వివిధ టెలివిజన్ చానల్స్ నిర్వాహకులు తమ ఒక్కో చానల్‌కు ఎంత చెల్లించాలో ధరలు నిర్ణయించడం, దానికి తోడు కనీస మొత్తం 130 రూపాయల వరకు చెల్లించాలని పేర్కొనడం పట్ల వినియోగదారులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ వారు కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించేందుకు 200-250 రూపాయల మధ్య చెల్లించేవారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ట్రాయ్ కొత్త విధానం వినియోగదారులకు పెనుభారంగా మారింది. పైకి మీరు వీక్షించే చానల్స్‌కు మాత్రమే సొమ్ము చెల్లించండి.. చూడని చానళ్లకు అనవసరంగా డబ్బు ఇవ్వొద్దు అన్న నినాదాన్ని వారు ప్రచారం చేస్తున్నా అది వినియోగదారులకు నష్టానే్న కలిగిస్తోంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఇన్నాళ్లూ ఉచితంగానో, నామమాత్రపు ధరతోనే ప్రసారాలు అందించే చానళ్ల వారు హఠాత్తుగా రేట్లు పెంచేసారు. ఫలానా మా టీవీకి 19 రూపాయలు, మా సినిమాకు 15 రూపాయలు ఇలా తమ నెట్ వర్క్‌కు చెందిన ఐదారు చానళ్లకు ఒక్కో రేటు చెల్లించాలని అంటూనే మొత్తం ప్యాక్ తీసుకుంటే 30కో, 40కో ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తెలుగు ప్రసారాలు చూసే కేబుల్ టీవీ ప్రేక్షకులు ఎక్కువగా జీ, మా, జెమినీ, ఈటీవీ తదితర నెట్‌వర్క్ చానళ్లను చూస్తుంటారు. ఇలా కేవలం ఐదారు నెట్‌వర్కులు మాత్రమే చూడాలనుకుంటే కనీస మొత్తం 130 ప్లస్ జీఎస్‌టీతో పాటు ఐదారు నెట్‌వర్కులకు మొత్తం 350 రూపాయలు పైనే అవుతోంది. అంటే వినియోగదారుడు ఇంతవరకు చెల్లించిన మొత్తం కంటే 150 రూపాయల వరకు అదనం అన్నమాట. అది కూడా కొన్ని పరిమితమైన చానళ్లు చూడటానికే. కనీస మొత్తం 130 రూపాయలు వసూలు చేస్తున్నందుకు వారు ఉచిత చానళ్లను సైతం ప్రసారం చేస్తామని అంటున్నారు.