బిజినెస్

తగ్గనున్న వడ్డీ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తూ 6.25 శాతం వద్ద నిర్ణయిస్తూ ఆర్‌బీఐ గురువారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. గత 18 నెలల్లో ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో నెలవారీ చెల్లింపుల్లో సామాన్యుడికి ఊరట లభించనుంది. ఈఎంఐ చెల్లింపులు తగ్గడం వల్ల సాధారణ పౌరుడు ఊపిరి పీల్చుకుంటాడు. రెపో, రివర్స్‌రేపో రేటు తగ్గడంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకే రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది. కాగా, రైతులకు ఇచ్చే హామీ లేని రుణాలను రూ.1 లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెంచారు. కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనపడుతున్నా, మార్కెట్లో జోష్ పెంచేందుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. బ్యాంకులు ఇక విరివిగా రుణాలు ఇచ్చేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆర్‌బీఐ కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటికే రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.75 వేల
కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ద్రవ్య పరపతి కమిటీ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతం వద్ద ఖరారు చేసేందుకు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా నలుగురు, ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం 2.19 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ నెలల్లో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతం నుంచి 3.4 శాతం మధ్య ఉండవచ్చు. గతంలో ద్రవ్యోల్బణం ఇదే కాలంలో 3.8 నుంచి 4.2 శాతం మధ్య నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత్‌దాస్ చెప్పారు. ఇక వినియోగదారులకు చౌకగా వస్తువులు లభ్యమవుతాయని, ఆర్‌బీఐ మంచి నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ గత ఏడాది ఆగస్టు నెలలో రెపో రేటును 0.25 శాతం మేర పెంచింది. ఇంతవరకు ఆరుసార్లు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించింది. 2017 ఆగస్టు మీటింగ్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. మార్కెట్లో ఇనె్వస్ట్‌మెంట్ కార్యకలాపాలు పెరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా జీడీపీ 7.4 శాతం మేర నమోదవుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. జీడీపీ రేటు ముందు 7.2 శాతం ఉంటుందని ఆర్‌బీఐ భావించింది. కాని తన అంచనాలను మార్చుకుని 7.4 శాతానికి ఎగబాకవచ్చని పేర్కొంది. వ్యవసాయ రుణాలపై కూడా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు డిపాజిట్ల పెంపుదల
బ్యాంకుల్లో డిపాజిట్లను రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కువ నిధులను బ్యాంకులు సేకరించేందుకు వీలవుతుంది. అలాగా వడ్డీ రేట్లను నిర్ణయంచే అధికారాన్ని కూడా బ్యాంకులకు కల్పించారు. 2013 జనవరిలో చివరిసారిగా ఈ తరహా విధానంపై ఆర్‌బీఐ సమీక్షించింది. అర్బన్ సహకార బ్యాంకుల విషయంలో త్వరలో ఒక విధానాన్ని తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్స్, క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అర్బన్ బ్యాంకులను సాంకేతికంగా, నిధుల సేకరణకు వీలుగా పటిష్టం చేసేందుకు ఒక విధాన పత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

చిత్రం..ఆర్బీఐ నిర్ణయాలను వెల్లడిస్తున్న గవర్నర్ శక్తికాంతదాస్