బిజినెస్

స్తబ్దుగా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం స్తబ్థుగా ముగిసినప్పటికీ మదుపర్లకు పెద్ద స్థాయిలో లాభాలు మాత్రం పంచాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా రెపో రేటును 0.25 శాతం తగ్గించిన క్రమంలో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. 30 షేర్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ తొలుత 200 పాయింట్లు ఎగబాకినప్పటికీ చివరికి పెద్దయెత్తున పతనమై 4.14 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.01 శాతం లాభాలతో 36,971.09 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 6.95 పాయింట్ల ఆధిక్యతతో 11,069.40 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లను భయపెట్టే ‘ఇండియా వీఐఎక్స్’ సూచీ 1.40 శాతం పెరిగింది. కాగా రెపో రేట్లలో కోతపెట్టడంతో రేట్ సెన్సిటివ్ స్టాక్స్ రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. రియాల్టీ సూచీలు 0.02 శాతం నష్టాలను చవిచూడగా, బ్యాంకింగ్ వాటాలు 0.04 శాతం, ఆటోమొబైల్ వాటాలు 1.77 శాతం లాభాలను సంతరించుకున్నాయి. కాగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు రెపోరేట్లు 6.25 శాతానికి పెరగవచ్చన్న అంచనాల నడుమ అనూహ్యంగా ఆ బ్యాంకు 0.25 శాతం కోతవిధించడం వల్ల గృహ రుణాలతోబాటు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ బ్యాంక్ మానిటరీ విధానాన్ని తటస్థంగా మార్చారు. దీంతో గతంలో ఉన్న కఠినతర నిబంధనలు సరళతరం అయ్యాయి. అప్పట్లోనే రేట్ల మార్పుపై ఆయన సంకేతాలిచ్చారు. కాగా ఈ రెపో రేట్ల తగ్గింపును మదుపర్లు ముందుగా ఊహించకపోవడం వల్ల కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని దీంతో తక్కువ స్థాయి సూచీలు దిగువన ట్రేడయ్యాయని మార్కెట్ విశే్లషకుడు దేబబ్రత బట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఐతే ‘రేట్ కట్’ ప్రభావం మధ్య తరహా, టర్మ్ మార్కెట్లలో సానుకూల ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా రిజర్వు బ్యాంకు తటస్థ విధానాన్ని అనుసరిస్తున్న దృష్ట్యా దేశీయ మార్కెట్లలోకి దీర్ఘకాలిక పెట్టుబడులే అధికంగా రావాల్సిన అవసరం ఉందని, వచ్చే మూడు నెలల కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న క్రమంలో ఆచితూచి అడులేసే దశలో ఇది మంచి పరిణామమే అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్త్ఫా నదీమ్ అభిప్రాయపడ్డారు.
సన్‌పార్మాకు అధిక లాభాలు
సెనె్సక్స్ విభాగంలో సన్‌పార్మా గురువారం 4.48 శాతం లాభాలతో అధిక లాభాలను ఆర్జించిన సంస్థగా నిలిచింది. అలాగే బజాజ్ ఆటో, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్ సైతం 3.01 శాతం అదనపులాభాలను సంతరించుకున్నాయి. ఐతే రిలయన్స్ ఇండియా లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ 1.50 శాతం నష్టాలను చవిచూశాయి. ఇలావుండగా విదేశీ మదుపర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం 694.97 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. అలాగే దేశీ సంస్థాగత మదుపర్లు 525.26 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
అంతర్జాతీయంగా..
ఇక ఆసియన్ మార్కెట్ల విషయానికొస్తే జపాన్‌కు చెందిన నిక్కీ 0.59 శాతం నష్టాలతో, కొరియాకు చెందిన కోస్పి స్తబ్థుగా ముగిశాయి. చైనా మార్కెట్లు చాంద్రమాన సంవత్సర నేపథ్యంలో గురువారం మూతపడ్డాయి. యూరప్ జోన్‌లోఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డిఏఎక్స్ 0.48 శాతం నష్టాలతో, పారిస్‌కు చెందిన సీఏడీ-40 0.30 శాతం నష్టాలతో ముగిశాయి. కాగా లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.18 శాతం లాభాలను సంతరించుకుంది. ఇంట్రాడేలో డాలర్‌తో భారత రూపాయి విలువ 11 పైసలు పెరిగి 71.45 వద్ద ట్రేడయింది. అలాగే ముడిచమురు ధరలు 0.06 శాతం పెరిగి బ్యారెల్ 62.73 డాలర్లు పలికింది.