బిజినెస్

చైనా కంపెనీ గ్రాండ్ పార్మాతో ‘గ్లెన్‌మార్క్’ వాణిజ్య ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ పార్మాస్యూటికల్స్‌కు చెందిన స్విట్జర్లాండ్ విభాగం చైనాకు చెందిన ‘గ్రాండ్ పార్మా కో’ సంస్థతో బుధవారం ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రత్యేకించి నాసల్ స్ప్రే ‘ర్యాల్ట్రీస్’ను గ్లెన్‌మార్క్ చైనాలో విక్రయాలు జరుపుతుంది. గ్లెన్‌మార్క్‌కు చెందిన స్విట్జర్లాండ్ విభాగం ‘గ్లెన్‌మార్క్ స్పెషాలిటీ ఎస్‌ఏ’ పేరుతో పనిచేస్తోంది. కాగా ఇకపై ఈ సంస్థ చైనాకు చెందిన గ్రాండ్ పార్మాతో కలిసి పరిశోధనలు సైతం నిర్వహిస్తుంది. అలెర్జీని పోగొట్టే నాజల్ స్ప్రేను చైనాలో అమ్మకాలు జరుపుతుందని అధికారులు వెల్లడించారు. ర్యాల్ట్రీస్‌కు సంబంధించి తయారీ, సరఫరాలను విస్తరించడంలో భాగంగా తమ కంపెనీకి ఇది మూడో ఒప్పందమని గ్లెన్ పార్మా తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థలతో తమ సంస్థ లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందని ఆ కంపెనీ తెలిపింది. చైనాలో ర్యాల్ట్రీస్ వాణిజ్యానికి సంబంధించి రెగ్యులేటరీ ఫైలింగ్ తమ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతుందని గ్లెన్‌మార్క్ పార్మాస్యూటికల్స్ చైర్మన్, ఎండీ గ్లెన్ సల్దాన్హా తెలిపారు.