బిజినెస్

యాస్పైర్ సిస్టమ్స్ చేతికి ఐ యాప్స్, ఒరాకిల్ యాప్స్ నిర్వహణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 7: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ స్పెషలిస్టు సంస్థ ‘ఐ యాప్స్’ నిర్వహణను చేపట్టబోతున్నట్టు అంతర్జాతీయ సాంకేతిక సేవల సంస్థ ‘ఆస్పైర్ సిస్టమ్స్’ బుధవారం నాడిక్కడ ప్రకటించింది. ఐతే ఇందుకు సంబంధించి ఎంతమొత్తం ఖర్చు చేయనుందీ ఆ సంస్థ వెల్లడించలేదు. ఐ యాప్స్ ఒరాకిల్ ప్లాటినమ్ క్లౌడ్ స్టాండర్డ్ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఒరాకిల్ ఫ్యూజన్ ఈఆర్‌పీ, హెచ్‌సీఎం సీఎక్స్, ఓరాకిల్ పాస్, ఓనీ చానల్ కనెక్ట్ సెంటర్‌లను పర్యవేక్షిస్తూ వాటిలో నైపుణ్యాన్ని పాదుకొలిపేందుకు కృషిచేస్తుంది. కాగా ఐ యాప్స్, యాస్పైర్ సిస్టమ్స్ నిర్వహణను చేపట్టడంతోబాటు ఒరాకిల్ వాణిజ్య విభాగాన్ని వాల్ఫోర్మా టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి కైవసం చేసుకుంటుంది. ఇందుకు సంబంధించి కూడా ఎంత ఖర్చు చేసేదీ వెల్లడించలేదు. ఐ యాప్స్, వాల్ఫోర్మా నిర్వహణలను చెపట్టడం వల్ల తమ సంస్థకు మధ్య, భారీ తరహా ఎంటర్‌ప్రైజెస్‌కు క్లౌడ్‌లోకి ప్రీమైజ్ అప్లికేషన్ల ద్వారా ప్రవేశించేందుకు వీలుకలుగుతుందని యాస్పైర్ సిస్టమ్స్ పేర్కొంది. అంతేకాకుండా ఎంటర్‌ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ) వంటి ఆధునిక విధానాల పట్ల దృష్టి నిలింపేందుకు సైతం ఈ కొత్త యాజమాన్య విధానం దోహదం చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. తదుపరి జనరేషన్ డిజిటల్ టెక్నాలజీల్లో తమ పెట్టుబడులు పెట్టి మరింత లోతైన సమర్థతను పెంచుకునే లక్ష్యంతోనే ఈ సమీకరణలను చేపట్టామని కంపెనీ చైర్మన్, సీఈఓ గౌరీ శంకర్ సుభ్రమణ్యం తెలిపారు.