బిజినెస్

ఫేస్‌బుక్ కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిక్కో, ఫిబ్రవరి 8: ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసి దానికి కారణాలను ఆన్‌లైన్‌లో చదివి ప్రాణాలు తీసుకుంటున్న దృశ్యాల ప్రసారంపై ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం మోపింది. ఇకపై ఈ తరహా దృశ్యాలు ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో నమోదు చేశాడు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్‌లో భాగంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇక్కడ గ్లోబల్ చీఫ్ ఆదం మొస్సోరీ, బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హ్యాన్‌కాక్‌తో సమావేశమై ఈ నిర్ణయం వెలువరించింది. బ్రిటన్‌కు చెందిన మోలీ రస్సెల్ అనే 14 ఏళ్ల బాలిక 2017లో తన పడగ గదిలోనే ప్రాణాలు తీసుకుంది. ఇవన్నీ ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు చేశారు. ఈ ఘటనపై బ్రిటన్ సమాజంలో పెద్ద ఎత్తున విశే్లషణ జరిగింది. పిల్లల మానసిక స్థితులపై సామాజిక మాధ్యమాలు చూపెట్టే ప్రభావంపై మేధావులు చర్చించారు. పిల్లలు మానసిక ఉద్వేగాలకు లోనవుతున్నారని, వీరిపై సామాజిక మాధ్యమాలు దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పిల్లల మానసిక ఆరోగ్యం పాడవుతోంది. పనీపాటాలేకుండా 24 గంటలు సోషల్ మీడియాలో ఉండడం వల్ల వారి మానసిక స్థితి అదుపుతప్పుతోంది. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, సంప్రదాయ జీవన విధానాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా ఉంది. వీటి ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారమవుతోంది. వీటిల్లో వచ్చిన సమాచారంలో నిజమెంత అని విశే్లషణ ఉండదు. కచ్చితమైన గణాంక వివరాలు ఉండవు. ప్రతి సమాచారం ఆసక్తిగా ఉంటుంది. కాని వాటికి ఆధారాలు ఉండవు. కాని యువత వీటిని చదివి నిజమనుకుంటారు. వాస్తవంలోకాకుండా భ్రమల్లో మునిగి తేలుతుంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ భయాలను, ఆందోళనలను పెంచుకుని నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఇటీవల ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌బర్గ్ మాట్లాడుతూ ఫేస్‌బుక్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చాలా వరకు నియంత్రణ చేశామని, కాని ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారవు. ఆన్‌లైన్‌లో ప్రమాదకరమైన సమాచారం, వీటి వల్ల చోటు చేసుకున్న ఘటనలపై త్వరలో శే్వతపత్రాన్ని విడుదల చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.