బిజినెస్

ఈఐఎల్ చేతికి మంగోలియా రీఫైనరీ ప్రాజెక్టు కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా (యూపీ), ఫిబ్రవరి 10: మంగోలియాలో సరికొత్త 1.5 మిలియన్ టన్నుల రీఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సలెన్సీ కాంట్రాక్టును ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) కైవసం చేసుకుంది. ఈమేరకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, మంగోలియా ప్రభుత్వానికి చెందిన రీఫైనరీ ఎల్‌ఎల్‌సీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. ఢిల్లీ పరిసరాల్లో జరిగిన పెట్రోటెక్ సదస్సులో ఈ మేరకు ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగోలియా పర్యటన సందర్భంగా బిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని మంగోలియాకు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ రుణంతో ప్రస్తుతం ఓ రీఫైనరీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈఐఎల్ ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్టు వివరించారు. మంగోలియా దేశంలోని సైన్‌షాండ్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ రీఫైనరీ ప్లాంటు ద్వారా యేడాదికి 1.5 బిలియన్ టన్నుల గ్రీన్‌ఫీల్డ్ ముడిచమురు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయన నివేదికను ఈఐఎల్ సమర్పించిందన్నారు. మంగోల్ రీఫైనరీ విభాగానికి ఈఐఎల్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీగా సేవలందజేస్తుందన్నారు. ఈమేరకు మంగోల్ రీపైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్తాంట్‌సెట్‌సెగ్ దాస్‌దేవా, ఈఐఎల్ కమర్షియల్ విభాగం డైరెక్టర్ ఆర్‌కే సబర్వాల్ ఎంవోయూల్లో సంతకాలు చేశారన్నారు.