బిజినెస్

23 చమురు బ్లాక్‌లకు మూడోదశ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 10: చమురు, సహజవాయులు, కోల్‌బెడ్ మీథేన్ (సీబీఎం)లకు చెందిన 23 బ్లాక్‌లకు ఓపెన్ ఆక్రియేజ్ లైసెన్సింగ్ విధానం ద్వారా మూడో దశ టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆహ్వానించింది. తద్వారా సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాలని అంచనావేస్తోంది. ఈ నిధులను దేశీయంగా ఉత్పత్తులు పెంచేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బిడ్ రౌండ్-3ని ఓఏఎల్‌పీ పేరిట ఢిల్లీకి సమీపంలో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రారంభించారు. 12 సెడిమెంటరీ బేసిన్లలోని 23 బ్లాక్‌లకు ఈ టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసింది. కాగా, ఓఏఎల్‌పీ-1లో 55 బ్లాకుల్లో మొత్తం 60 వేల చదరపుకిలోమీటర్ల విస్తీర్ణానికి గడచిన ఏడాది జనవరిలో టెండర్లు నిర్వహించామని మంత్రి తెలిపారు.