బిజినెస్

విదేశీ పెట్టుబడిదారులతో హాంగ్‌కాంగ్‌లో ఆర్బీఐ గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ మంగళవారం హాంగ్‌కాంగ్‌లో విదేశీ పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటన ద్వారా విలేఖలకు తెలియజేశారు. దాస్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ఇలా పెట్టుబడిదారుతో ముఖిముఖి నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా ఈ సమావేశం, చర్చలు సత్ఫలితాలను ఇస్తాయన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. దాస్ ఇప్పటికే దేశీయంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బ్యాంకర్లు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, పారిశ్రామిక చాంబర్లతో వరుసగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో కార్పొరేట్ రుణ మార్కెట్‌లో ఫారిన్ పోర్ట్‌పోలియో పెట్టుబడులను 20 శాతం తగ్గించుకునే నిబంధనలపై సూచనలు అధికంగా వచ్చాయి. 2018 ఏప్రిల్ వరకు వచ్చిన పెట్టుబడులకే ఈ నిబంధన పరిమితం కావాలన్న సూచనలు వచ్చాయి. ఒక కార్పొరేట్ సంస్థలోని బాండ్ పోర్ట్‌పోలియోల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 20 శాతానికి మించకూడదన్న నిబంధన సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కార్పొరేట్ రుణ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఆ నిబంధనను సడలించాలని ఈనెల 7న జరిగిన ఆర్బీఐ 6వ బై మంత్లీ విధాన నిర్ణయ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈనేపథ్యంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ హాంగ్‌కాంగ్‌లో విదేశీ పెట్టుబడిదారుతో సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.