బిజినెస్

వరుసగా నాలుగో రోజూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటపట్టాయి. మంగళవారం చివరి గంటల్లో మదుపర్లు వాటాల అమ్మకాలకు పాల్పడటంతోబాటు అంతర్జాతీయంగా నెలకొన్న వ్యతిరేకతతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ 241.41 పాయింట్లు కోల్పోయి 0.66 శాతం నష్టాలతో 36,153.62 వద్ద స్థిరపడింది. గత మూడు సెషన్లతో కలుపుకుని సెనె్సక్స్ మొత్తం 580 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. అలాగే నిఫ్టీ సైతం 57.40 పాయింట్లు కోల్పోయి 0.53 శాతం నష్టాలతో 10,831.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. రియాల్టీ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్దయెత్తున వాటాల విక్రయాలు జరిగాయి. గడచిన డిసెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన విడుదలైన గణాంకాలు, జనవరి నెల వినిమయ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలతో మదుపర్లు రక్షణాత్మక ధోరణిని అవలంభించారని విశే్లషకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరంభంలో వచ్చిన లాభాలను సూచీలు కొనసాగించలేక చతికిలపడ్డాయి.
అధికంగా నష్టపోయిన సంస్థలివే..
హీరోమోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌తోబాటు ఆటోవిభాగం, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మంగళవారం అత్యధికంగా నష్టపోయాయి. ఈ సంస్ధలు దాదాపు 2.63 శాతం నష్టాలను చవిచూశాయి. మరోవైపు సన్‌పార్మా, కోల్ ఇండియా, టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, వేదాంత, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆర్‌ఐఎల్ సంస్థలు సుమారు 2 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఇలావుండగా అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చైనా రాజధాని బీజింగ్‌లో కార్యరూప స్థాయి మంతనాలు మంగళవారం ఆరంభమయ్యాయి. వచ్చే శుక్రవారం అర్ధరాత్రి వరకు డెడ్‌లైన్ ఉన్న దృష్ట్యా మళ్లీ మార్కెట్ షట్‌డౌన్‌కు దారితీయకుండా ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఈ చర్చల్లో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చారని, ఇది అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిందని, అన్ని మార్కెట్లూ లాభాలను సంతరించుకున్నాయని మార్కెట్ విశే్లషకుడు పరాస్ బోత్రా తెలిపారు.
ఐతే మన దేశీయ మార్కెట్లో బీఎస్‌ఈ రియాల్టీ సూచీలు 1.29 శాతం కోల్పోగా, ఐటీ 0.94 శాతం, బ్యాంకెక్స్ 0.81 శాతం, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.73 శాతం, ఆటో 0.51 శాతం, పీఎస్‌యూ 0.31 శాతం, కేపిటల్ గూడ్స్ 0.19 శాతం, పవర్ 0.08 శాతం, వినిమయ వస్తువులు 0.07 శాతం, చమురు, సహజవాయుల సంస్థలు 0.06 శాతం వంతున నష్టపోయాయి. కాగా లోహ, ఆరోగ్య రక్షణ, వౌలిక సదుపాయాల సూచీలు 1.65 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఇక ఫారిన్ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) 125 కోట్ల రూపాయల విలువైన వాటాల విక్రయించారు. అలాగే దేశీయ ఇనె్వస్టర్లు సైతం 232.55 కోట్ల రూపాయల విలువైన వాటాలను సోమవారం విక్రయించారు. అంతర్జాతీయంగా నిక్కీ (జపాన్) 2.61 శాతం, కోస్పి (కొరియా) 0.45 శాతం లాభపడగా తైవాన్‌కు సూచీలు 0.93 శాతం, షాంఘయ్ కాంపోజిట్ 0.68 శాతం, హ్యాంగ్‌సంగ్ (హాంగ్‌కాంగ్) 0.10 శాతం లాభాల బాటలో నడిచాయి. యూరోపియన్ మార్కెట్లలో ప్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.99 శాతం, పారిస్‌కు చెందిన సీఏసీ-4- 0.72 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.33 శాతం వంతున లాభపడ్డాయి.