బిజినెస్

రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో విస్తరించిన రన్‌వే సహా అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. దీంతో మరో మూడు నెలల్లో తిరుపతి, షిర్డీలతోపాటు అంతర్జాతీయ సర్వీసులు తిరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్య అతిధిగా పాల్గొని ఎయిర్‌పోర్టు అభివృద్ధిని వెల్లడించారు. ఎయిర్‌పోర్టు రన్‌వేను 1700 మీటర్ల నుంచి 3165 మీటర్లకు విస్తరించారన్నారు. రన్‌వే అభివృద్ధికి 850 ఎకరాల భూమిని సేకరించారని, రూ.350 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ, గెయిల్ తదితర సంస్థలున్నందున ఢిల్లీ వరకు రామహేంద్రవరం నుంచి విమాన సేవలు అందించవచ్చన్నారు. పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువు కానుందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. విజయవాడ విమానాశ్రయం రన్‌వే అభివృద్ధి కూడా బాగా జరిగిందన్నారు. వివాఖపట్నం విమానాశ్రయం అభివృద్ధికి కూడా ఈ రోజు శంకుస్థాపన జరిగిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం రాజ్‌కిషోర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయం బ్రిటిష్ హయాంలో 1936వ సంవత్సరంలో ఏర్పాటుచేశారన్నారు. 1985-95 మధ్యలో వాయుదూత్ సర్వీసులు నడిచేవని, నేడు బోయింగ్ విమానాల రాకపోకలకు అవకాశం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, గెయిల్ సీజీ ఎంకేవీ రమేష్, రాజమహేంద్రవరం సబ్ -కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, మున్సిపల్ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ, అడిషనల్ ఎస్పీ లతా మాధురీ, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, పక్కన రాజమహేంద్రవరం, నరసాపురం ఎంపీలు మురళీమోహన్, గంగరాజు