బిజినెస్

వడ్డీ రేటు మరింత తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: చిల్లర ద్రవ్యోల్బణం మరింత తగ్గి జనవరి నెలలో 19 నెలల కనిష్ఠ స్థాయి 2.05 శాతానికి పడిపోయిన కారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఏప్రిల్‌లో తీసుకునే విధాన నిర్ణయంలో రెపో రేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, ఆరు శాతానికి చేర్చే అవకాశం ఉందని ఒక బ్రోకరేజ్ నివేదిక తెలిపింది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ నెల అంచనాను అంతకు ముందు అంచనా వేసిన 2.19 శాతం నుంచి 2.11 శాతానికి తగ్గించడం జరిగింది. 2018 జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉండింది. ‘మెత్తబడిన ద్రవ్యోల్బణం కారణంగా మరోసారి వడ్డీ రేటు తగ్గొచ్చు. 2019 జనవరి నెలలో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గడం అనేది ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) ఏప్రిల్‌లో జరిగే భేటీలో రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, ఆరు శాతానికి చేరుస్తుందనే మా విశ్వాసాన్ని బలపరుస్తోంది’ అని కోటక్ సెక్యూరిటీస్ బుధవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఎంపీసీ తన ఏడో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించడానికి ఏప్రిల్ రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు సమావేశం కానుంది. ఆర్‌బీఐ తన ఆరో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో అందరి అంచనాలకు భిన్నంగా రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి చేరుస్తూ ఈ నెల 7వ తేదీన ప్రకటించింది. ఆర్‌బీఐ గత 18 నెలల కాలంలో వడ్డీ రేటును తగ్గించడం ఇదే మొదటిసారి. కేంద్ర బ్యాంకు తన పాలసీ భంగిమను గతంలో ప్రకటించిన ‘కాలిబ్రేటెడ్ టైటెనింగ్’ నుంచి ‘న్యూట్రల్’కు సవరించడం జరిగింది. ఇది కూడా ఆర్‌బీఐ వడ్డీ రేటును మరింత తగ్గిస్తుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది.