బిజినెస్

చివరలో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా బలహీనపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా అయిదో సెషన్ బుధవారం వంద పాయింట్లకు పైగా పడిపోయింది. మదుపరులు బ్యాంకింగ్, వాహన, లోహ, ఫార్మా షేర్లలో సెషన్ చివరి గంటలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఆరంభంలో ఆర్జించిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) తగిన మోతాదులో అమ్మకాలకు పూనుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని బ్రోకర్లు చెప్పారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ బుధవారం 36,279.63 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత ముందుకు సాగుతూ 36,375.80 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఆహార వస్తువుల ధరల తగ్గుదల కొనసాగడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వంటి సానుకూల స్థూలార్థిక సంకేతాల గణాంకాలతో పాటు ఆసియన్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా ఈ సూచీ పుంజుకుంది. అయితే, సెషన్ చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ 35,962.79 పాయింట్ల కనిష్ఠ స్థాయికి దిగజారింది. చివరకు ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 119.51 పాయింట్ల (0.33 శాతం) దిగువన 36,034.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 720 పాయింట్లకు పైగా పడిపోయింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 37.75 పాయింట్ల (0.35 శాతం) దిగువన 10,793.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,891.65- 10,772.10 పాయింట్ల మధ్య కదలాడింది. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ బ్యాంకెక్స్, ఆటో, మెటల్, హెల్త్‌కేర్ సూచీలు 1.1 శాతం వరకు దిగువన ముగిశాయి. బుధవారంనాటి లావాదేవీలలో ప్రధానంగా నష్టపోయిన సంస్థలలో ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఎల్‌అండ్‌టీ, యెస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, ఎన్‌టీపీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.84 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ సంస్థల షేర్ల ధర 2.18 శాతం వరకు పెరిగింది.