బిజినెస్

తగ్గిన లేలాండ్ త్రైమాసిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: హిందుజాగ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ లాభాల్లో 21.44 శాతం త్రైమాసిక తగ్గుదలను నమోదు చేసింది. గడచిన డిసెంబర్‌తోముగిసిన మూడోత్రైమాసిక ఫలితాలను ఆ కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 381 కోట్ల రూపాయల లాభాలను కంపెనీ ఆర్జించింది. ఐతే గడచిన ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 21.44 శాతం తక్కువ. ఉత్పత్తులపై ధరల వత్తిడితోబాటు, ముడి సరుకు ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ అధికారులు తెలిపారు. 2017-18 మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ 485 కోట్ల లాభాలను గడించింది. కాగా తాజా త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం సైతం గణనీయంగా తగ్గింది. గడచిన యేడాది ఇదే కాల వ్యవధిలో 7,191 కోట్ల ఆదాయాన్ని గడించిన ఈ కంపెనీ తాజా త్రైమాసికంలో 6.325 కోట్లకే పరిమితమైంది. ఈ త్రైమాసికానికి తమ కంపెనీకి చెందిన మొత్తం పారిశ్రామిక వాల్యూమ్ 7 శాతం తగ్గిందని అశోక్ లేలాండ్ సీఎఫ్‌ఓ గోపాల్ మహదేవన్ తెలిపారు. ఇంజన్ల నాణ్యతా పరీక్షలకు సంబంధించి సాధించిన బిఎస్-6ను మొత్తం ఇంజన్లకు వర్తింపజేస్తామన్నామని మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దేశాయ్ తెలిపారు. 2020 నాటికి తమ కంపెనీ నుంచి అత్యాధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త వాహనాలను తీసుకువస్తామని ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపారు. రాబోయే ఎన్నికలకు ముందే రక్షణ శాఖలో తమ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు. తక్కువ బరువు కలిగిన వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ)పై దృష్టి సారించామన్నారు. ఎల్‌సీవీ వ్యాపారం సైతం అశోక్ లేలాండ్‌లోకి ప్రస్తుతం విలీనం అయిందన్నారు.ఎడమ చేతి వైపుడ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఉందన్న ఫిర్యాదులు అధికంగా వస్తున్నందున ఇలాంటివి సరిదిద్దుకుని పూర్తి స్థాయిలో ఆధునిక వాణిజ్య వాహనాల రూపకల్పనకు శ్రీకారం చుడతామన్నారు. కాగా ఈ కంపెనీ వాటాలు గురువారం 7.03 శాతం వృద్ధితో బీఎస్‌ఈలో ఒక్కో షేరు ధర 84.50 రూపాయలు పలికింది.