బిజినెస్

తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: స్టాక్ మార్కెట్ మాదిరిగానే భారత బులియన్ మార్కెట్ కూడా గురువారం నష్టాలను ఎదుర్కొంది. మరుసగా ఐదోరోజు బంగారం ధర పతనం కావడం విశేషం. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ, దేశీయ డిమాండ్ బులియన్ మార్కెట్‌ను ఆదుకుంటూ వచ్చింది. అయితే, గత ఐదు రోజులుగా దేశీయ మదుపరుల నుంచి కూడా డిమాండ్ కనిపించడం లేదు. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర గురువారం మరో 50 రూపాయలు పతనమై 34,000 రూపాయలకు చేరింది. ఈనెల తొమ్మిదిన 34,280 రూపాయలుగా ఉన్న పది గ్రాముల బంగారం ధర ఆతర్వాత రోజురోజుకూ పడిపోతున్నది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర 150 రూపాయలు పతనం కావడంతో 40,650 రూపాయల వద్ద ముగిసింది. తొమ్మిదో తేదీన కిలో వెండి 41,250 రూపాయల ధర పలికింది. ఆతర్వాత బంగారం మాదిరిగానే పతనమతున్నది.