బిజినెస్

పెరిగిన రూపాయి మారకం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: భారత రూపాయి మారకం విలువ బుధవారం స్వల్పంగా పెరిగింది. అమెరికన్ డాలర్‌తో మూడు పైసలు పెరిగి 71.31 రూపాయలకు చేరింది. నిలకడైన చమురు ధరల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్లడం బుధవారం కూడా కొనసాగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్చేంజ్ ( ఫారెక్స్) మార్కెట్‌లో స్థానిక యూనిట్లు 71.29 వద్ద బలంగా ఆరంభమై చివరకు స్వల్ప లాభాలతో 71.31 వద్ద ముగిశాయి. సోమవారం గ్రీన్ బ్యాక్‌కులో 71.34 వద్ద రూపాయి విలువ ముగిసింది. మంగళవారం ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవం నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు సెలవుదినం కాగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ.813.76 కోట్ల విలువైన వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. అలాగే దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు 1,163.85 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. ముడిచమురు ధరలు బ్యారెల్‌పై 0.14 శాతం పెరిగి 66.54 డాలర్లకు చేరా యి. కాగా డాలర్ ఇండెక్స్ గ్రీన్‌బ్యాక్ సోమవారం మొత్తం ఆరు కరెన్సీలు బలపడేందుకు దోహదం చేయగా బుధవారం 0.01 శాతం స్వల్పంగా నష్టపోయి 96.51గా నమోదైంది.