బిజినెస్

స్థిరాస్తి రంగానికి ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: గృహ కొనుగోలుదారులకు ఇదో శుభవార్త. దేశంలో స్థిరాస్తి రంగం పుంజుకోవడానికి ఇది దోహదపడుతుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి.. నిర్మాణంలో ఉన్న గృహాలు వంటి ఆస్తులపై జీఎస్‌టీ రేటును ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించింది. అయితే, దీనికి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తించదు. ఆదివారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు తెలిపారు. జీఎస్‌టీ మండలి అఫర్డేబుల్ హౌసింగ్‌పై జీఎస్‌టీ రేటును ప్రస్తుతం ఉన్న ఎనిమిది శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది. అఫర్డేబుల్ హౌసింగ్ పరిధిలో స్వల్ప మార్పులు చేసింది. కొత్తగా అమ్మకం ధరను రూ. 45 లక్షలు పరిమితిగా విధించింది. అలాగే మెట్రో నగరాలలో విస్తీర్ణాన్ని (కార్పెట్ ఏరియా) 60 చదరపు మీటర్లకు, మెట్రోయేతర నగరాలలో 90 చదరపు మీటర్లకు పెంచింది. సవరించిన జీఎస్‌టీ రేట్లు 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయినట్లు సర్ట్ఫికెట్ జారీ చేయకుండా ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై 12 శాతం, అఫర్డేబుల్ హౌసింగ్‌పై ఎనిమిది శాతం చొప్పున జీఎస్‌టీ ఉంది. వీటిలోనే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఉంది. అయితే బిల్డర్లు ఐటీసీ ప్రయోజనాలను తమకు బదిలీ చేయడం లేదని వినియోగదారులు భావిస్తున్నందున జీఎస్‌టీ మండలి ఐటీసీని తొలగించాలని, జీఎస్‌టీ రేటును వరుసగా అయిదు, ఒక శాతానికి తగ్గించాలని నిర్ణయించిందని జైట్లీ తెలిపారు. ఐటీసీని తొలగించినందున రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నగదు లావాదేవీల వైపు మళ్లవలసిన అవసరం లేదన్నారు. జీఎస్‌టీ రేట్లను తగ్గించినందు వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. లాటరీలపై జీఎస్‌టీకి సంబంధించి మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.