బిజినెస్

రుణ మార్కెట్ల నుంచి రూ.1,900 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశీయ రుణ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుపోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) 1,900 కోట్ల రూపాయల విలువైన వాటాలను ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు విక్రయించారు. పుల్వామా ఘటనతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుందని విశే్లషకులు భావిస్తున్నారు. తాజా గణాంకాల మేరకు విదేశీ పెట్టుబడిదార్లు రూ.2,039 కోట్ల రూపాయలు మన దేశ ఈక్విటీల్లో ఈనెల 22వ తేదీ వరకు మదుపు చేశారు. గడచిన జనవరిలో ఎఫ్‌పీఐలు అటు ఈక్విటీ, ఇటు రుణ మార్కెట్ల నుంచి 5,360 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించడం ద్వారా నిధులు వెనక్కు తీసుకున్నారు. అలాగే ప్రస్తుత నెలలో 22వ తేదీ వరకు 1,949 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు. ఏదేమైనప్పటికీ ఈక్విటీల్లో పెట్టుబడులు మాత్రం పెరిగాయి. గడచిన యేడాది ఈ కాలంతో పోలిస్తే సుమారు 98 కోట్ల అధికమొత్తం పెట్టుబడులు వచ్చాయి. పుల్వామా ఉగ్రదాడితో విదేశీ ఇనె్వస్టర్లు జాగరూకతతో వ్యవహరించారని, అందువల్లే విదేశీ పెట్టుబడుల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలిక ట్రెండ్‌ను పరిశీలిస్తున్న మదుపర్లు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నందున ఇప్పటికిప్పుడే ఇందుకు సంబంధించిన తదుపరి అంచనాలు వేయడం సరికాదని ప్రముఖ ఆర్థిక రంగ విశే్లషకుడు శ్రీవాత్సవ అంటున్నారు, వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, దేశ ఆర్థికాభివృద్ధిపై మదుపర్లు వేచిచూసే దోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.