బిజినెస్

ఆర్బీఐ ఆర్థిక బలహీన బ్యాంకుల జాబితా నుంచి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రిజర్వుబ్యాంక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల జాబితా నుంచి మరో మూడు నుంచి నాలుగు బ్యాంకులు బయటపడనున్నాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ఇది జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిల్వల బలోపేతం కోసం 48,239 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్రం ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఏసీ) ఫ్రేమ్‌వర్క్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలోనే అమలులోకి రానున్న ఈ కేంద్ర ఆర్థిక సాయం ద్వారా కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్ తొలుత ఆర్బీఐ పీసీఏ ఫ్రేమ్‌వర్క్ పరిధి నుంచి వెలుపలికి వస్తాయి. ఇందులో ప్రధానంగా కార్పొరేషన్ బ్యాంకు అధికంగా పీసీఏ ఫ్రేమ్‌వర్క్ ద్వారా 9,086 కోట్ల రూపాయలు నిధులు పొందనుంది. తర్వాత స్థానంలో ఉన్న అలహాబాద్ బ్యాంకుకు 6,896 కోట్ల నిధులు అందుతాయి. అందువల్ల ఈ బ్యాంకులకు అవసరమైన మూలధనం 7,375-1 నిష్పత్తి, 8,875 శాతం టైర్-1 నిష్పత్తి చేకూరుతుంది. అలాగే ‘కేపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అస్సెట్స్ రేషియో (సీఆర్‌ఏఆర్)లో 10.875 శాతంతో బాటు స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) నిష్పత్తి 6 శాతం కన్నా తక్కువగా నమోదవుతాయి. ఇందువల్ల ఈ రెండు బ్యాంకులు పీసీఏ నుంచి బయటపడనున్నాయి. గత డిసెంబర్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఎల్), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)లకు నిధులు సమకూర్చిన తర్వాత గత జనవరి 31న ఈ బ్యాంకులు పీసీఏ పరిధి నుంచి వెలుపలికి వచ్చిన విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం పీసీఏ జాబిజాలో ఉన్న బ్యాంకుల సంఖ్య 8కి తగ్గింది. వీటిలో ఒకటైన దేనాబ్యాంకు ఏప్రిల్ 1న జాబితా నుంచి బయటపడనుంది. అంతేకాకుండా ఈ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేయడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలోనే జాబితాలోని బ్యాంకుల సంఖ్య మరింత తగ్గనుంది. అలాగే ఎల్‌ఐసీకి అధిక భాగస్వామ్యం ఉన్న ఐడీబీఐ సైతం ఆర్థిక పరంగా ఆరోగ్యకరమైన స్థితికి చేరుతోంది. ఈ బ్యాంకు నిరర్థక ఆస్తులు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. అందువల్ల ఐడీబీఐ సైతం పీసీఏ నుంచి సెప్టెంబర్‌లో బయట పడనుందని ఆర్థిక రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే సెంట్రల్, యూకో బ్యాంకులు సైతం పనితీరులో మంచి ప్రమాణాలను నమోదుచేస్తూ పురోగమిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో మరో నాలుగు బ్యాంకులు పీసీఏ నుంచి వెలుపలికి వస్తుండటం శుభపరిణామని అంటున్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం విషయంలో స్థిరమైన ‘4ఆర్’ విధానాన్ని అనుసరిస్తుందని గత నెలలో కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొనడం జరిగింది. రికగ్నిషన్, రీకేపిటలైజేషన్, రెజల్యూషన్, రీఫార్మ్ అనే నాలుగు ఆర్‌ల విధానాన్ని ఈమేరకు కేంద్రం తదుపరి కూడా అమలు చేయనుంది. ఇలావుండగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి రుణ బకాయిలు ఈ యేడాది 23,860 కోట్లకు తగ్గాయి. అలాగే రుణాల రికవరీ కూడా 60,726 కోట్లకు చేరింది. ఇది గత యేడాదితో పోలిస్తే ద్విగుణీకృతం.