బిజినెస్

బోనస్ షేర్ల జారీకి విప్రో సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బోనస్ షేర్ల జారీకి విప్రో సంస్థ సిద్ధమవుతున్నది. అదే విధంగా అధీకృత మూలధనాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టనుంది. ఈ రెండు ప్రతిపాదనలకు షేర్ హోల్డర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు విప్రో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలోనే విప్రో పాలక మండలి బోనస్ షేర్ల విడుదల ప్రతిపాదనను ఆమోదించింది. వాటాదారులకు, తమ వద్ద ఉన్న ప్రతి మూడు షేర్లకు ఒక బోనస్ షేర్‌ను కేటాయించాలని తీర్మానించింది. ఈనెల 22న ఈ-ఓటింగ్‌కు చివరి రోజుగా నిర్ణయించింది. ఒకవేళ తగినంత మంది ఓటింగ్‌లో పాల్గొనకపోతే, ఆ తీర్మానాలను వాటాదారులంతా ఆమోదించినట్టే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, మెజారిటీ వాటాదారులు ఓటింగ్‌లో పాల్గొనడమేగాక, పాలక మండలి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఇలావుంటే, కంపెనీ ప్రస్తుత అధీకృత మూలం ధనం 1,126.50 కోట్ల రూపాయలుకాగా, షేర్ క్యాపిటల్‌ను పెంచేందుకు ఆమోద ముద్ర లభించడంతో, అది 2,526.50 కోట్ల రూపాయలకు చేరనుంది. ఇందుకుగాను రెండు రూపాయల ముఖ విలువగల 700 కోట్ల ఈక్విటీ షేర్లను విప్రో మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. విప్రో గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ 2018 డిసెంబర్ నాటికి రూ.46,847.90 కోట్లు.