బిజినెస్

డీఈఐలో థామస్ కుక్ వాటాలు 51 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 25: డిజిఫొటో ఎంటర్‌టైన్‌మెంట్ ఇమేజింగ్ (డీఈఐ)లో 51 శాతం వాటలను కొనుగోలు చేసినట్టు పర్యాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న థామస్ కుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇమేజింగ్ సొల్యూషన్స్ విభాగంలో సేవలు అందిస్తున్న డీఈఐలో థామస్ కుక్ కొన్న వాటాల విలువ 40.6 మిలియన్ డాలర్లు (సుమారు 289 కోట్ల రూపాయలు). ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో విమానయాన రంగంలో సేవలు అందిస్తున్న థామస్ కుక్ ఫోరెక్స్ వ్యాపారంలోనూ తలమునకలైంది. ఈ రెండు రంగాలను సమర్థంగా నిర్వహిస్తున్న ఈ కంపెనీ తాజాగా డీఈఐలో సగానికిపైగా వాటాలు కొనుగోలు చేయడం, వ్యాపార పరిధిని విస్తరిస్తున్నదనే సంకేతాలను పంపుతున్నది. ఇలావుంటే, ఈ చట్టపరమై న అనుమతులు, ఇతరత్రా లాంఛనాలు పూర్తయిన తర్వాతే కొనుగోళ్ల ప్రక్రియ ముగుస్తుంది. ఒకవేళ అనుమతులు రాకపోతే, ఈ ఒప్పందం రద్దవుతుంది.