బిజినెస్

నీరవ్ మోదీకి ఈడీ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని కంపెనీలకు చెందిన 147.72 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయితోబాటు గుజరాత్‌లోని సూరత్‌లోగల పలు స్థిర, చరాస్తులను ఈ ఈడీ అటాచ్ చేయగా ఈ ఆస్తుల మార్కెట్ విలువ 147 కోట్ల 72 లక్షల 86వేల 651 రూపాయలు అని అధికారులు వెల్లడించారు. అటాచ్ చేసిన వాటిలో 8 కార్లు, ప్లాంట్లు, మిషనరీ, జువలరీతో కూడిన కన్‌సైనె్మంట్లు, పెయింటింగ్‌లు, కొన్ని భవనాలు ఉన్నాయి. రూ.13వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ మోదీ నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇతనికి చెందిన కంపెనీలు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, రాధేషిర్ జువలరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రిథమ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు సైతం ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం తాజాగా ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగింది. పంజాబ్ నేనల్ బ్యాంకు నుంచి నీరవ్ మోదీకి చెందిన గ్రూపుకంపెనీలు సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్, డైమండ్ ఆర్‌యూఎస్‌లకు విడుదలైన నిధులను నీరవ్ మోదీ, అతని బంధువులు, అతని అధీనంలోని వాటాదార్ల సొంత ఖాతాల్లోకి మళ్లించారని ఈడీ దర్యాప్తులో తేలిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. సీబీఐ రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ గత యేడాది ఫిబ్రవరి 15న మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా మోసపూరితంగా అండర్‌టేకింగ్ లేఖలు సృష్టించి పంజాబ్‌నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ, అతని అనుచరులు మోసగించారని ఈడీ అభియోగాలు మోపింది. ఈక్రమంలో దేశ, విదేశాల్లోని సుమారు 1,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ అటాచ్ చేయడం జరిగింది. అలాగే సుమారు రూ.489.75 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, ఆభరణాలు తదితర విలువైన వస్తువులు సైతం అటాచ్ చేయడం జరిగింది.