బిజినెస్

లాభాల్లో ధనలక్ష్మి , అలహాబాద్, కార్పొరేషన్ బ్యాంకు షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: బలహీన బ్యాంకుల జాబితా నుంచి విముక్తి కలుగజేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ధనలక్ష్మీ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వాటాలు స్టాక్ మార్కెట్‌లో సానుకూలతను సంతరించున్నాయి. బుధవారం ఈ మూడు బ్యాంకుల వాటాలు సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర నిధుల సాయంతో ఆర్థిక సమత్యుల్యాన్ని సంతరించుకున్న ఈ మూడు బ్యాంకులపై ఉన్న ‘వీక్ బ్యాంక్ వాచ్ లిస్టు’ను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ఎత్తివేసింది. అలాగే వాణిజ్యపరమైన ఆంక్షలను సైతం ఉపసంహరించుకుంది. దీంతో బీఎస్‌ఈలో ధనలక్ష్మీ బ్యాంక్ వాటాలు 10 శాతం, అలహాబాద్ బ్యాంక్ వాటాలు 7.53 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ 5.82 శాతం వంతున లాభపడ్డాయి. ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఏసీ) ఫ్రేమ్‌వర్క్ పరిధి నుంచి ఈ మూడు బ్యాంకులను తప్పిస్తున్నట్టు మంగళవారం నాడు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బ్యాంకుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ బోర్డ్ ఫర్ ఫైనాన్షియల్ సూపర్విజన్ (బీఎఫ్‌ఎస్) ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం వీటికి ఈనెల 21న అదనపునిధులు సమకూర్చిన సంగతి విధితమే. పీసీఏ నిబంధనలకు అనుగుణంగా నిరర్థక ఆస్తులను సైతం తగ్గించడంతోబాటు, మూలధన నిల్వలు పెంచడంతో ఈ బ్యాంకులకు బలహీన బ్యాంకుల జాబితా నుంచి విముక్తి లభించిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈమేరకు ఈనెల 26న జరిగిన సమావేశంలో తొలుత అలహాబాద్, కార్పొరేషన్ బ్యాంకులకు పీసీఏ ఫ్రేమ్‌వర్క్ నుంచి విముక్తి కలిగింది. తదుపరి ధనలక్ష్మీ బ్యాంకుకు విముక్తి కలిగించాలని నిర్ణయం జరిగిందని అధికారులు తెలిపారు.