బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు యుద్ధ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) బుధవారం నాటి లావాదేవీలను యుద్ధ భయం వెంటాడింది. ఫలితంగా ఆరంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 68 పాయింట్లు కోల్పోయింది. నిష్టీ కూడా సుమారు 29 పాయింట్ల పతనమైంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించడం స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత్ ప్రకటించడం, ఆ వెంటనే, భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను పడగొట్టడమేగాక, ఒక పైలట్‌ను బందీగా పట్టుకున్నామని పాకిస్తాన్ అధికారికంగా వెల్లడించడం బీఎస్‌ఈలో బుధవారం నాటి ట్రేండింగ్‌ను దెబ్బతీశాయి. మదుపరుల సెంటిమెంట్‌పై సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం బలంగా పని చేసిన నేపథ్యంలో, సెనె్సక్స 68.28 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి, 35,905.43 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 28.65 పాయింట్ల (0.26 శాతం) పతనమై, 10,806.65 పాయింట్లకు పడిపోయింది. నిజానికి స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం సానుకూల ధోరణుల్లోనే మొదలైంది. ప్రారంభంలో సెనె్సక్స్ సుమారు 400 పాయింట్ల వరకూ పెరిగింది. మంగళవారం 240 పాయింట్ల పతనం నమోదు కావడంతో, బుధవారం నాటి ట్రేడింగ్ ఏ దశగా సాగుతుందన్న అనుమానాలకు తెరదించుతూ, వాలాదేవీలు లాభాల బాటలో నడిచాయి. దీనితో అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆరంభంలో దూకుడుగా కొనసాగిన అమ్మకాలు ఆతర్వాత నీరసించాయి. పాకిస్తాన్‌తో ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలవుతుందనే అనుమానం మార్కెట్ పతనాన్ని శాసించింది. సుమారు నాలుగు వందలకుపైగా పాయింట్ల లాభంతో ముగుస్తుందనుకున్న సెనె్సక్స్ అందుకు భిన్నంగా, నష్టాల్లో ముగిసింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ బుధవారం ట్రేడింగ్ ఇదే తరహాలో కొనసాగడంతో, నిఫ్టీకి కూడా నష్టాలు తప్పలేదు. 30 షేర్ సెనె్సక్స్ పతనం కారణంగా భారీగా నష్టపోయిన కంపెనీల జాబితాలో టాటా మోటర్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ కంపెనీ వాటాలు ఏకంగా 3.01 శాతం నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అదే విధంగా వేదాంతకు 2.92 శాతం, హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్)కు 1.77 శాతం, కోటక్ మహీంద్రకు 1.61 శాతం, ఎన్‌టీపీసీకి 1.17 శాతం నష్టాలు తప్పలేదు. అదే విధంగా ఇన్ఫోసిస్ 0.94 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.88 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.78 శాతం, హీరో మోటార్స్ 0.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.66 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రతికూల పరిస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కొని, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2.43 శాతం లాభాలను ఆర్జించాయి. బజాజ్ ఆటో 2.09 శాతం, లార్సెన్ అండ్ టొబ్రో 1.49 శాతం, సన్ ఫార్మా 1.39 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.09 శాతం చొప్పున లాభాలను తమతమ ఖాతాల్లో వేసుకున్నాయి. కాగా, 50 షేర్ నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్ 2.66 శాతం, అల్ట్రా టెక్ 2.15 శాం, ఎల్ అండ్ టీ 1.51 శాతం, బజాజ్ ఆటో 1.46 శాతం, సన్ ఫార్మా 1.29 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. కాగా, వేదాంత (3.30 శాతం), విప్రో (3.28 శాతం), టాటా మోటార్స్ (3.23 శాతం), హెచ్‌యూఎల్ (2.07 శాతం) చొప్పున నష్టపోయాయి. స్థూలంగా చూస్తే, బుధవారం నాటి ట్రేడింగ్‌లో సంస్థాగత మదుపరులు 720.27 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మిన షేర్ల విలువ 1,674.17 కోట్ల రూపాయలు.