బిజినెస్

మళ్లీ లాభాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 1: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల పట్టాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న టెన్షన్ తగ్గడంతో మార్కెట్లకు ఊతం లభించింది. వరుసగా మూడు రోజులపాటు నష్టాల పాలైన కీలకమైన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ శుక్రవారం బలమైన సానుకూలతలతో ఆరంభమై పరుగులు పెట్టి 36,140.67 పాయింట్లను తాకింది. రోజంతా ఆగకుండా విదేశీ పెట్టుబడులు కొనసాగుతూండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత కొన్ని కౌంటర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీల పరుగుకు బ్రేక్‌పడింది. చివరికి 196.37 పాయింట్ల ఆధిక్యతతో 0.55 శాతం లాభాలతో 36,063.81 వద్ద సెనె్సక్స్ సూచీ స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 71.35 పాయింట్లు లేదా 0.69 శాతం లాభాలతో 10,863,50 వద్ద ముగిసింది. ఒక దశలో నిఫ్టీ 10,823.10 దిగువకు చేరి మళ్లీ కోలుకుంది.
ఫైనాన్షియల్, కేపిటల్ గూడ్స్, ఐటీ, విద్యుత్, చమురు సహజవాయుల రంగాలు మంచి లాభాలను సంతరించుకున్నాయి. దీంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. కొత్త మార్చి ఎఫ్ అండ్ ఓ సిరీస్ ఆరంభం కావడం సైతం మార్కెట్‌కు ఊతమిచ్చిందని విశే్లకులు పేర్కొంటున్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు సోమవారం సెలవుదినం. కాగా విదేశీ సంస్థాగత మదుపర్లు 3,210.6 కోట్ల రూపాయల విలువైన వాటాల కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు మాత్రం 5,240.62 కోట్ల విలువైన వాటాల విక్రయానికి పాల్పడినట్టు గురువారం నాటి గణాంకాలు వెల్లడించాయి. ఇలాఉండగా దేశ ఆర్థికాభివృద్ధి గణాంకాలు ఆశించినంతగా లేకపోవడం మదుపర్ల ఉత్సాహాన్ని నీరుగార్చింది. ఐదు త్రైమాసికాల కంటే తక్కువగా గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 6.6 శాతానికి ఈ వృద్ధిరేటు పరిమితం కావ డం స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేసిందని విశే్లషకులు పేర్కొన్నారు. ఈనెల 31తో ముగిసే ఆర్థిక సం వత్సరానికి వృద్ధిరేటును గతంలో పేర్కొన్న 7.2 నుంచి 7 శాతానికి సవరించడంతో గడచిన ఐదేళ్ల కాలంలో ఇదే అతి తక్కువ ఆర్థికాభివృద్ధిగా నమోదైంది. ఇలావుండగా రూపాయి మారకం విలువ సై తం ఇంట్రాడేలో 27 పైసలు తగ్గి అమెరికన్ డాలర్‌కు రూ.70.99 పలికింది. అలాగే ముడిచమురు ధర పెరిగి బ్యారెల్‌కు 66.55 డాలర్లకు చేరి వ్యాపారులకు లాభాలు పంచింది. ఆసియన్ మా ర్కెట్ సూచీలు సైతం లాభాల బాటపట్టాయి. ప్ర త్యేకిం చి చైనా మార్కెట్లు అధిక లాభాలు ఆర్జించాయి.