బిజినెస్

ఆర్‌ఈసీ వాటాదారులకు మధ్యంతర డివిడెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని గ్రామీణ విద్యుత్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)కి చెందిన బోర్డు సమావేశం గురువారం నాడిక్కడ జరిగింది. సంస్థకు చెందిన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ వాటాపై 11 రూపాయలు మధ్యంతర డివిడెండ్ కింద ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే స్టాక్ మార్కెట్‌లో నిధుల సమీకరణ పరిధిని సైతం 60 వేల కోట్ల నుంచి 85 వేల కోట్లకు పెంచాలని బోర్డు నిర్ణయించింది. ఈ మధ్యంతర డివిడెండ్‌ను మార్చి 19న వాటాదార్లకు ఇవ్వడం లేదా డిస్పాచ్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఐతే 2019-20 సంవత్సరానికి నిధుల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు వ్యతిరేకించింది. కాగా మూలధనానికి సంబంధించిన పన్ను మినహాయింపు బాండ్లను సిరీస్-8గా ప్రారంభించాలన్న ప్రతిపాదనకు బోర్డు అంగీకారం తెలిపింది. ప్రైవేటు ప్లేస్‌మెంట్ పద్ధతిలో ద్వారా రూ.2500 కోట్లు సమీకరించాలని సైతం ఆర్‌ఈసీ బోర్డు నిర్ణయించింది.