బిజినెస్

ఆందోళన కలిగిస్తున్న వేరుశనగ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మూర్చి 2: దేశంలో వేరు శనగ ఉత్పత్తి దారుణంగా పడిపోతే, ఆందోళన కలిగిస్తున్నది. సుమారు పదేళ్ల కాలంలో రెండో అత్యల్ప ఉత్పత్తి నమోదయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా 46.95 మిలియన్ టన్నుల వేరు శనగ ఉత్పత్తి జరిగింది. అంతకు ముందు, 2010-11 ఆర్థిక సంవత్సరంలో 82.65 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 69.64 మిలియన్ టన్నులకు పతనమైంది. మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి మరింత దారుణంగా మారి, అత్యల్ప రికార్డును నమోదు చేసింది. అయితే, ఆ మరుసటి సంవత్సరం (2013-14) ఒక్కసారిగా ఉత్పత్తి పెరిగింది. ఏకంగా 97.14 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం విశేషం. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధిక ఉత్పత్తి. అంటే, వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యల్ప, అత్యధిక ఉత్పత్తులు నమోదయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 74.02 మిలియన్ టన్నులు, 2015-16లో 67.33 మిలియన్ అన్నుల చొప్పున వేరు శనగ ఉత్పత్తి జరిగింది. 2016-17లో 74.62 మిలియన్ అన్నులు, 2017-18లో 91.79 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి జరిగింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకూ 63.28 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. సుమారు నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఈ ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశాలు ఎంతమాత్రం లేదు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దారుణంగా పతనమైన వేరు శనగ ఉత్పత్తి, రాబోయే కాలంలోనైనా పెరుతుందా? లేదా? అన్నది ఆందోళన కలిగిస్తున్నది.