బిజినెస్

శాఖల విస్తరణపై ఎస్‌బీఎం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్‌బీఎం) ఇప్పుడు భారత్‌లో తన డిపాజిట్ల మొత్తాన్ని పెంచుకోవాలని, శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్ల కాలంలో తన శాఖల సంఖ్యను నాలుగింతలు పెంచుకొని, 16కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎస్‌బీఎం భారత్‌లో తాను ఇచ్చే రుణాల మొత్తాన్ని రూ. 5,000 కోట్లకు పెంచాలని కోరుకుంటున్నట్టు గతంలో ప్రకటించింది. అయితే, ఈ రుణాలపై అధిక మొత్తంలో వడ్డీలు వేయడం జరుగబోదని కూడా తెలిపింది. ఎస్‌బీఎంకు ప్రస్తుతం భారత్‌లో నాలుగు శాఖలు ఉన్నాయని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిద్ధార్థ్ రథ్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. తమ బ్యాంకు శాఖలను 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎనిమిదికి, 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 16కు పెంచనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, కొత్త శాఖలను ఎక్కడెక్కడ తెరవబోతున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.