బిజినెస్

మరో రెండు విమాన సర్వీసుల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 4: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన మరో రెండు విమానాల సేవలు నిలిచిపోయాయి. ఈ రెండు విమానాలకు చెల్లించవలసిన అద్దె బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాటి సేవలను కోల్పోయినట్టు జెట్ ఎయిర్‌వేస్ శనివారం నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రంలో పేర్కొంది. ఈ రెండు విమానాలతో కలుపుకొంటే జెట్ ఎయిర్‌వేస్ నుంచి ఆపరేషన్లకు దూరమయిన విమానాల సంఖ్య మొత్తం 23కు పెరిగింది. అద్దె ఒప్పందం ప్రకారం విమానాలను అద్దెకిచ్చిన వారికి అద్దె చెల్లించకపోవడం వల్ల తాజాగా మరో రెండు విమానాలు ఆపరేషన్లకు దూరమయ్యాయని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ నడుపుతున్న మొత్తం విమానాలలో దాదాపు 20 శాతం విమానాలు ఇప్పటి వరకు ఆపరేషన్లకు దూరమయ్యాయి.