బిజినెస్

రత్నగిరి విమానాశ్రయం నుంచి త్వరలో విమానాల రాకపోకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 4: రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్న రత్నగిరి విమానాశ్రయం నుంచి త్వరలో పౌర విమానాల రాకపోకలను ప్రారంభిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. రక్షణ శాఖతోబాటు, విమానయాన శాఖకు చెందిన వాటాదార్లతో ఈ మేరకు ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. కొంకణ్ రీజియన్‌లోని రత్నగిరి విమానాశ్రయాన్ని పౌర విమానాశ్రయంగా మార్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వంతోబాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ (ఏఏఐ) సంయుక్తంగా చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పౌర విమానాలను నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. సివిల్ టెర్మినల్, నేవిగేషన్ సదుపాయాల వంటి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ఏఏఐ మహారాష్ట్ర ప్రభుత్వంతోబాటు, రాష్ట్ర పరిశ్రమల విభాగంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని సురేష్ ప్రభు తెలిపారు. రీజినల్ కనెక్టివిటీ స్కీం ద్వారా మూడోదశ టెండర్ల ఆహ్వాన ప్రక్రియ ఆరంభమైందన్నారు. రత్నగిరి-ముంబై-రత్నగిరి సెక్టార్‌లో ఈ పనులు జరగాల్సి వుందన్నారు.