బిజినెస్

సోలార్ ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: తమిళనాడు ప్రభుత్వం తమకు అప్పచెప్పిన సోలార్ ప్రాజెక్టులను సమర్థంగా పూర్తి చేశామని ఎన్‌ఎల్‌సీ ఇండియా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీకి తమిళనాడు 500 మెగావాట్స్ సామర్థ్యంగల సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం కాంట్రాక్టును ఇచ్చింది. మొదటి దశలో 300 మెగావాట్స్ పవర్ ప్లాంట్స్‌ను పూర్తి చేసిన ఈ కంపెనీ మిగతా 200 మెగావాట్స్ పని కూడా ఇప్పుడు పూర్తయిందని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. తమిళనాడు అప్పచెప్పిన పనిని పూర్తి చేశామని ఆ ఫైలింగ్‌లో వివరించింది. నవరత్న’ కంపెనీల్లో ఒకటైన ఎన్‌ఎల్‌సీ భారత బొగ్గు మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్నది. ఈ కంపెనీ ఇంత వరకూ 4,731 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్స్‌ను నిర్మించింది.