బిజినెస్

రూ.49.99 లక్షల ఆడీ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్ధ ఆడీ మంగళవారం సరికొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘సెడాన్ లైఫ్‌స్టైల్’ పేరిట రూపుదిద్దుకున్న ఈ కొత్త ఎడిషన్ కారు ధర 49.99 లక్షలు. రియర్ సీట్ ఎంటర్‌టెయినె్మంట్, మొబైల్ కాఫీ మిషన్ ఎస్‌ప్రెసోమోబిల్, ఎంట్రీ, ఎగ్జిట్ లైట్లు వంటి అధునాతన హంగులతో ఈ కారు ఆకట్టుకుంటుంది. స్టైల్‌ను, కొత్తదనాన్ని కోరుకునే ఆధునిక యువతను ఆకట్టుకునేలా ఈ కారు ఫీచర్లు ఉంటాయని ఆడీ ఇండియా అధినేత రాహిల్ అన్సారీ తెలిపారు. ఈ కారు ద్వారా లగ్జరీ కార్లను ఆస్వాదించాలనుకునే వారికి తమ కంపెనీ మరింత చేరువైందన్నారు. ప్రత్యేకించి ఆడి ఎ-6పై ప్రత్యేక మోజును కస్టర్లలో ఇప్పటికే పాదుకొల్పామన్నారు. పూర్తి స్థాయి నెట్‌వర్క్‌తో కూడిన 25,65 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ టాబ్‌లెట్ల ద్వారా సీట్ల వద్ద ప్రయాణికులు మంచి వినోదాన్ని ఆస్వాదిస్తారన్నారు. 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్లతో ప్రస్తుతం ఎ-6 సిడాన్ కార్లు అందుబాటులో ఉన్నాయన్నారు.