బిజినెస్

రాజన్ విధానాలను కొనసాగించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్య విధానాన్ని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రశంసించింది. ఆయన నిర్ణయాలను ఇకముందూ ఆర్‌బిఐ తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ దిగిపోతున్నది తెలిసిందే. ఈ క్రమంలో కొత్త గవర్నర్ రాజన్ విధానాలను అనుసరించడం మంచిదని, అలా చేస్తేనే ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయవచ్చని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ తెలిపింది. గడచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం చాలా తగ్గుముఖం పట్టిందని, ఇందుకు రాజన్ నిర్ణయాలే కారణమని గుర్తుచేసింది.
బ్యాంకులను ప్రశ్నించిన ఆర్‌బిఐ
మరోవైపు కోల్‌కతాకు చెందిన బియ్యం వ్యాపార సంస్థ ఆర్‌ఇఐ అగ్రో లిమిటెడ్‌కు 5,262 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చిన 21 బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. అక్రమ కార్యకలాపాలతో సంబంధమున్నట్లు తేలిన సదరు సంస్థకు అంత పెద్ద మొత్తంలో రుణాన్ని ఎలా పొడింగించారన్నదానిపై యూకో బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కూటమిని నిలదీసింది. ఇప్పటికే బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల తీరును ఆర్‌బిఐ తప్పుబట్టింది.