బిజినెస్

స్థలం కేటాయిస్తే... చైనా కంపెనీలు క్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో చైనా నిర్మాణ రంగ మెటీరియల్ కంపెనీల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో గుజో ప్రొవిన్షియల్ ఎకనామిక్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు చెందిన వర్కింగ్ కమిటీ సెక్రటరీ డింగ్ డింగ్ జెన్‌షెంగ్, గుజో రెడిమిక్స్ కాంక్రీట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీ వెన్ యాంగ్, జిఐఐసి భారత ప్రతినిధి సూ పే, గుజో ప్రాంత నిర్మాణ రంగ మెటీరియల్ కంపెనీల బృందం సభ్యులు కమిషనర్‌తో చర్చలు జరిపారు. అమరావతి రాజధానిలో ఆధునిక నిర్మాణ సామగ్రి, ప్లాంట్ టెక్నాలజీ ద్వారా తక్కువ కాలంలో ఇంధన సామర్థ్య, పర్యావరణ అనుకూల నిర్మాణాలను చేపడతామని చైనా బృందం నాయకుడు డింగ్ జెన్‌షెంగ్ సమావేశంలో ప్రతిపాదించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంపై ఆసక్తి వ్యక్తం చేశారు. కాంక్రీట్ మెటీరియల్ ప్లాంట్ టెక్నాలజీ, అండర్‌గ్రౌండ్ డక్ట్స్, వర్షపు నీటి కాల్వలు, అండర్ గ్రౌండ్ వాటర్ సరఫరాలో తమకు ఆధునిక సాంకేతిక నైపుణ్యం, తగిన అనుభవం ఉందని తెలిపారు. అవకాశం కల్పిస్తే రాజధాని నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయగలమని చెప్పారు. గుజో ఆర్థికాభివృద్ధి విభాగం అధికారులు చర్చలో భాగంగా అమరావతిలో పారిశ్రామిక పార్క్ స్థాపించి చైనా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్సాహం చూపించారు. పారిశ్రామిక పార్క్‌కు స్థలం కేటాయిస్తే చైనా కంపెనీలను రప్పించి పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసి స్థానికంగా ఉపాధి కల్పనకు తోడ్పడతామన్నారు. చైనా బృందం ప్రతిపాదనలపై కమిషనర్ శీధర్ సానుకూలంగా స్పందించారు. వాటిని పరిశీలన జరుపుతామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎపిసిఆర్‌డిఎ అదనపు కమిషనర్లు ఎ మల్లికార్జున, వి రామమనోహరరావు, చీఫ్ ఇంజనీర్ డి కాశీ విశే్వశ్వరరావు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వి నాగిరెడ్డి, చైనా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.