బిజినెస్

పరిశోధక విద్యార్థుల పరిస్థితి ఇంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: ప్రభుత్వ నేతృత్వంలో నడస్తున్న ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) సంస్థలో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యం ఫిబ్రవరి నెల జీతాల్లో 50 శా తం కోత విధించింది. దేశంలోని ప్రధాన పరిశోధ నా సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల కొ రతను ఎదుర్కొంటుండటం గమనార్హం. ఈమేరకు టీఐఫ్‌ఆర్ రిజిస్ట్రార్ వింగ్ కమాండర్ (రిటైర్డ్) జార్జి ఆంటోనీ ఉద్యోగులకు గురువారం సర్క్యులర్ జా రీ చేశారని విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. నిధుల కొరత కారణంగా కేంద్ర కార్యాలయంతో బాటు, ఫీల్డ్ స్టేషన్స్‌లో ఉన్న అందరు ఉ ద్యోగులు, విద్యార్థులు, పోస్ట్ డాక్టోరియల్ ఫెలోస్ కు నికర వేతనంలో యాభై శాతం మాత్రమే పొం దుతారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఐతే దీ నిపై వివరణ కోరేందుకు సంప్రదించినపుడు స్పందించేందుకు ఆంటోనీ నిరాకరించారు. కాగా ఈ సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి కథనం మేర కు వేతనంలో కోత మూలంగా ముంబై, ఇతర ప్రాంతాల్లోనూ పనిచేస్తున్న, విద్యనభ్యసిస్తున్న సు మారు 3వేల మంది ఇబ్బందుల పాలవుతారని తెలిసింది. ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ దీనిపై వ్యాఖ్యానిస్తూ ప్రఖ్యాత అద్భుత పరిశోధనా సంస్థ టీఐఎఫ్‌ఆర్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని ట్వీట్ చేశారు. ఈ వేతన కోతం ఎం దుకు విధించాల్సి వచ్చిందో ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌లో మరో వ్యక్తి ట్వీట్ చేశారు, ఇలాంటి సంస్థకే ఈ గతి పట్టితే దేశంలో విద్యా సంస్థల భవితవ్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నా రు. కేంద్ర ప్రభుత్వ అణు శక్తి శాఖ నేతృత్వంలో ఒకే గొడుగు కింద నడుస్తున్న జాతీయ పరిశోధనా కేంద్రాల్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా 2002 నుంచి టీఐఎఫ్‌ఆర్ కొనసాగుతోంది.