బిజినెస్

నాలుగో రోజూ లాభాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా నాలుగో రోజు కూడా లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ఆశనిరాశల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి సెనె్సక్స్ 89.32 పాయింట్లు పెరగడంతో, 36,725.42 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 5.20 పాయింట్లు పెరిగి, 11,058.20 పాయింట్లుగా నమోదైంది. దేశీయ మదుపరులు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శించడంతో ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లకు డిమాండ్ ఏర్పడింది. 30 షేర్ సెనె్సక్స్ ప్యాక్‌లో భారీగా నష్టపోయిన కంపెనీ కోల్ ఇండియా. జాతీయ స్థాయిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు, రాజకీయ పరిమాణాలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ అండ్ టీ నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి మారకపు విలువ స్థిరంగా లేకపోవడం వంటి అంశాలు కొంత వరకూ మార్కెట్‌ను శాసించిన నేపథ్యంలో, ఒకానొక సమయంలో సెనె్సక్స్ పతనం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. మూడు రోజుల వరుస లాభాలకు తెరపడుతుంద న్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, దేశీ య మదుపరులు కొనుగోళ్లపై మొగ్గు చూపడంతో, సెనె్సక్స్, నిఫ్టీ నష్టాలను బయపడ్డాయి. స్వల్ప లా భాల్లోనే ట్రేడైనప్పటికీ, నష్టాల బారిన పడకుండా బయటపడడాన్ని సానుకూల స్పందనగా చూడాలని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్ అండ్ టీ 2.76, యాక్సిస్ బ్యాంక్ 1.71, ఐటీసీ 1.61, ఎస్‌బీఐ 1.26 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, కోల్ ఇండియా 3.09, సన్ ఫార్మా 1.97, ఎన్‌టీపీసీ 1.68, ఓఎన్‌జీసీ 1.58, ఎస్ బ్యాంక్ 1.47 శా తం చొప్పున నష్టాలను చవిచూశాయి. అదే విధం గా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో గురువారం జరిగిన ట్రేడింగ్‌లో ఎల్ అండ్ టీ (3.09 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (1.96 శాతం), యాక్సిస్ బ్యాంక్ (1.89 శాతం), ఎస్‌బీఐ (1.38 శా తం), పవర్ గ్రిడ్ (1.33 శాతం) వాటాలు లాభాల పంట పండించాయి. ఐఓసీ (3.45 శాతం), కోల్ ఇం డియా (3.42 శాతం), జీ ఎంటర్‌టైన్‌మెంట్ (3.16 శాతం), విప్రో (3.05 శాతం), ఎన్‌టీపీసీ (2.25 శాతం) కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.