బిజినెస్

వసతులు కల్పించకుంటే గుర్తింపు రద్దు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలోని పెద్ద ఔషధ కంపెనీల్లో ఒకటైన జూబిలెంట్ లైఫ్ సైనె్సస్ విస్తరణ ప్రణాళికకు అడ్డుకట్ట పడే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ కంపెనీకి జార్ఖండ్‌లోని రూర్కీలో నెలకొల్పిన యూనిట్‌లో సరైన వసతులు, వౌలిక సదుపాయాలు లేవని, వాటిని వెంటనే తమ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దకపోతే గుర్తింపు రద్దు చేస్తామని జూబిలెంట్ సంస్థను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) హెచ్చరించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో దాఖలు చేసిన ఫైలింగ్‌లో జూబిలెంట్ తెలిపింది. అయితే, యూఎస్‌ఎఫ్‌డీఏ ఏఏ అంశాలను ప్రస్తావించారు? ఎలాంటి సదుపాయాల ఉండాలని కోరారు? అనే విషయాలను జూబిలెంట్ వివరించలేదు. ప్రస్తుతం రూర్కీ యూనిట్‌లో జరుగుతున్న ఔషధాల ఉత్పత్తి, సరఫరాకు యూఎస్‌ఎప్‌డీఏ లేఖ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ పూర్తి ఆదాయంలో అమెరికా నుంచి వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమేనని పేర్కొంది. యూఎస్‌ఎఫ్‌డీఏ చేసిన సూచనల ప్రకారం మార్పులుచేర్పులు చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. పదిహేను రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.