బిజినెస్

ద్రవ్యోల్బణం, వర్షాలపై అంచనాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ద్రవ్యోల్బణం గణాంకాలు, వర్ష సమాచారం ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో మంగళవారం నుంచి ట్రేడింగ్ మొదలవనుండగా, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు మదుపరులపై ముందుగా ప్రభావం చూపవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. జూలైకిగాను గత వారం విడుదలైన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగితే, జూన్‌కుగాను వెల్లడైన ఐఐపి గణాంకాలు తగ్గుముఖం పట్టినది తెలిసిందే. ద్రవ్యోల్బణం 6.07 శాతానికి చేరగా, ఐఐపి 2.1 శాతానికి దిగజారింది. ఈ క్రమంలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మంగళవారం వెలువడనున్నాయి. దీంతో వీటి ప్రభావం మదుపరుల పెట్టుబడులపై ఉంటుందని విశే్లషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ బాండ్ల వేలం
మరోవైపు మంగళవారం బిఎస్‌ఇలో విదేశీ మదుపరులకు 9,358 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్నారు. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నాం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది. నిజానికి సోమవారమే వేలం జరగాల్సి ఉండగా, సెలవుతో వాయదా పడింది.