బిజినెస్

ప్రతిపాదన పంపితే పరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ప్రతిపాదన ఏదైనా పంపితే పరిశీలించి, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఐడీబీఐ బ్యాంక్‌లో ఉన్న వాటాల కుదింపుపై ఎల్‌ఐసీకి భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి కార్పొరేషన్ (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. ఐడీబీఐలో ఎల్‌ఐసీ ఇటీవలే 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఖాతాదారుల నుంచి వసూలు చేసే సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే, అందుకు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ప్రైవేటు రంగం బ్యాంకుల్లో 15 శాతానికి మించిన వాటాలను ఒకే ప్రమోటర్‌కు ఇవ్వడానికి వీల్లేదని ఆర్‌ర్బీఐ ఆదేశాలు ఉన్నాయి. ఐఆర్‌డీఏఐ కూడా ఇన్సూరెన్స్ కంపెనీల పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించడమేగాక, నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? అనేది విశే్లషిస్తూ ఉంటుంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల కింద, ఎల్‌ఐసీని ఈ నిబంధనను నుంచి అటు ఆర్‌బీఐ, ఇటు ఐఆర్‌డీఏఐ మినహాయింపునిచ్చారు. ఈ కారణంగానే ఐడీబీఐలో 51 శాతం వాటాలను ఎల్‌ఐసీ కొనుగోలు చేయగలిగింది. కానీ, ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ సంస్థల వాటాలను 50 శాతం మించకుండా చూస్తామని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను తగ్గిస్తామని ఆయన చేసిన ప్రకటనే ఐడీబీఐ బ్యాంక్‌లో తనకు ఉన్న వాటాలను తగ్గించాలని ఎల్‌ఐసీ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, వాటాలను తగించుకోవడానికి సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలు ఏవైనా ఉంటే తమకు పంపాలని, వాటిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎల్‌ఐసీకి ఐఆర్‌డీఏఐ తెలిపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐడీబీఐలో ఎల్‌ఐసీ 51 శాతం వాటాలను గత ఏడాది డిసెంబర్ 28న కొనుగోలు చేసింది. ఇందుకుగాను తొలుత 14,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అనంతరం, ఈ ఏడాది జనవరి 21న మరో 5,030 కోట్ల రూపాయలను ఐడీబీఐకి చెల్లించడంతో, ఆ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటా 51 శాతానికి చేరింది. డిసెంబర్ 31తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాల్లో 4,185.48 కోట్ల రూపాయల మేర నష్టాలను ఎదుర్కొన్నట్టు ఐడీబీఐ ప్రకటించడంతో ఎల్‌ఐసీ ఆందోళనకు గురైంది. అందుకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం తగ్గింది. 7,125.20 కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయం 6,190.94 కోట్ల రూపాయలకు పడిపోవడంతో, నష్టాలు తప్పలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఐడీబీఐలో తమ వాటాలను తగ్గించుకోవడానికి ఎల్‌ఐసీ ప్రయత్నిస్తున్నది. అందుకే, ఐఆర్‌డీఏఐ అనుమతి కోరింది. ఈ అభ్యర్థనపై స్పందించిన ఐఆర్‌డీఏఐ తొలుత ప్రతిపాదన పంపాలని, అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఎల్‌ఐసీకి స్పష్టం చేసింది.