బిజినెస్

జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చారిత్రక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 15: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్.. చరిత్రలోనే అపూర్వ ఘట్టమని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ అన్నారు. 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సోమవారం కంపెనీ స్థాయి స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా గజ్వేలు నుండి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జైపూర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారన్నారు. ఇప్పటివరకు 200 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తిచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాలుపంచుకోనుందని తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 660 లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. లక్ష్య సాధనకు రోజుకు కనీసం రెండు లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 75 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వివరించారు.

చిత్రం.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న సింగరేణి సిఎండి శ్రీ్ధర్