బిజినెస్

ఫోన్ల సర్టిఫికేషన్ కాలవ్యవధి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: మొబైల్ ఫోన్లు, టెలికాం పరికరాల నిర్బంధ పరీక్షలు, సర్ట్ఫికేషన్‌కు నిర్దేశించిన కాలవ్యవధిని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. వచ్చే ఆగస్టు 1 వరకు ఈ డెడ్‌లైన్‌ను పొడిగించినట్టు సంబంధిత అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. టెలికమ్యూనికేషన్ శాఖ తొలిసారిగా ఈ నిబంధనను 2012లో తీసుకువచ్చి ఇందుకు సంబంధించిన చివరి తేదీని ఆ ఏడాది ఏప్రిల్ 1 వరకు నిర్ధేశించడం జరిగింది. అయితే ఆ తర్వాత చాలాసార్లు ఈ విషయంపై వినియోగదారుల నుంచి వ్యతిరేకతలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనల అమలుకు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీని చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన సాంకేతిక విభాగం టెలికాం ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ) ఈమేరకు ఈనెల 12న ఆదేశాలు జారీ చేసింది. 2018 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల మేరకు వైఫై ఆక్సెస్ పాయింట్లు, శాటిలైట్ పరికరాలు, టెలిఫోన్ విడిభాగాలు తదితరాలను తప్పనిసరిగా పరీక్షలు చేయించి, అధికారిక ఏజెన్సీల ద్వారా సర్ట్ఫికెట్లు పొందిన తర్వాతే విక్రయాలు జరపాల్సివుంటుంది. ఇందుకు 2019 జనవరి 1వరకు డెడ్‌లైన్ విధించింది. మొబైల్ బేస్ స్టేషన్లు, రూటర్లు, ఇంటర్నెట్ డివైస్‌లు, ఇతర నెట్‌వర్క్ గేర్‌లను టెస్ట్ చేయించుకుని, సర్ట్ఫికెట్లు పొందేందుకు తర్వాత ఏప్రిల్ 1వరకు డెడ్‌లైన్ విధించారు. సైబర్ నేరాలకు సంబంధించి వచ్చిన ఆరోపణల క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు 2011 నాటి టెలికాం శాఖ లైసెన్సింగ్ రూల్స్‌లో సవరణలు తీసుకువచ్చింది. ఆమేరకు అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఏజెన్సీల ద్వారా సక్రమంగా పరీక్షలు చేయించి భద్రతా పరమైన సర్ట్ఫికేషన్ పొందిన తర్వాతే టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికరాలను ఇన్‌స్టాల్ చేయాల్సివుంటుందని, 2013 మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంటుందని ప్రకటించడం జరిగింది. దీనిపై స్పందించిన మొబైల్ అసోసియేషన్ అధ్యక్షురాలు భావనాకుమారి మాట్లాడుతూ గడువు పొడగింపు మొబైల్ ఫోన్ల తయారీదార్లకు మాండిటరీ టెస్టింగ్ అండ్ సర్ట్ఫికేషన్ ఆఫ్ టెలికాం ఎక్యూప్‌మెంట్ (ఎంసీటీఈ) పరంగా సరళతరమైన లావాదేవీలు సాగించేందుకు అనుకూలమైనదిగా ఉంటుందని వ్యాఖ్యానించారు.